-
-
Home » Andhra Pradesh » Chittoor » Tirumala anr-MRGS-AndhraPradesh
-
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
ABN , First Publish Date - 2022-10-05T16:01:08+05:30 IST
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

తిరుపతి (Tirupathi): తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. వరాహ పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రత్తాళ్వార్లకు అభిషేకం నిర్వహించారు. బుధవారం రాత్రితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కాగా శ్రీవారి సర్వదర్శనానికి గంట సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 68,539 మంది భక్తులు దర్శించుకోగా... 22,177 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.90 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.