మరో ముగ్గురి రాక

ABN , First Publish Date - 2022-03-04T06:36:40+05:30 IST

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మన జిల్లా విద్యార్థులు ఒక్కొక్కరుగా ఇళ్లకు చేరుకుంటున్నారు.

మరో ముగ్గురి రాక
ఇండియా గేటు వద్ద చైతన్య

బి.కొత్తకోట/రామసముద్రం/శాంతిపురం/చిత్తూరు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మన జిల్లా విద్యార్థులు ఒక్కొక్కరుగా ఇళ్లకు చేరుకుంటున్నారు. మదనపల్లె వివేకానందనగర్‌కు చెందిన నవ్యశ్రీ, నితీ్‌ష గురువారం సాయంత్రం బెంగళూరు మీదుగా ఇంటికి చేరారు. శాంతిపురం మండలం తోపుచేనుకు చెందిన  వినోద్‌కుమార్‌ గురువారం ఇంటికి చేరాడు. తహసీల్దారు లోకేశ్వరరావు అతడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బి.కొత్తకోట డీసెంట్‌ కాలనీకి చెందిన సాయినిఖిత గురువారం రాత్రికి బెంగళూరు చేరుకోగా.. ఇదే ప్రాంతానికి చెందిన చైతన్య ఢిల్లీ చేరారు. మదనపల్లెకు చెందిన కె.ప్రవీణ్‌కుమార్‌, హర్షిత... తిరుపతికి చెందిన జె.పావని, ఎ.నాగసత్య, గోపిక వర్షిణి, ఎం.శ్రీవిష్ణు,  భానుప్రకాష్‌, సాగరిక, సాయిచరణ్‌, క్రిష్టి స్వర్ణ... వాల్మీకిపురానికి చెందిన పి.జయశ్రీలతోపాటు జిల్లాకు చెందిన జె.ప్రియాంక, డి.శివరాం, శ్రీకర్‌రెడ్డి, యోగానంద్‌, సాయి సంతోష్‌ ఉక్రెయిన్‌ నుంచి బయల్దేరారు.25 నుంచి 30 మంది దాకా ఉక్రెయిన్‌లోనే ఇళ్లకు చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Read more