ఈ ఉద్యోగాలు చేయలేం

ABN , First Publish Date - 2022-02-23T07:02:56+05:30 IST

ఈ ఉద్యోగాలు చేయలేమని.. తమ రాజీనామాలు ఆమోదించాలంటూ ఎండీయూ ఆపరేటర్లు వాపోయారు.

ఈ ఉద్యోగాలు చేయలేం
తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆపరేటర్లు

మా రాజీనామాలు ఆమోదించండి

ఎండీయూ ఆపరేటర్ల వినతి


పూతలపట్టు, ఫిబ్రవరి 22: ఉదయం నుంచి సగం రాత్రి వరకు ఇంటింటికీ బియ్యం పంపిణీ చేస్తున్న తమ జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని పూతలపట్టు మండలంలోని ఎండీయూ ఆపరేటర్లు వాపోయారు. ఈ ఉద్యోగాలు చేయలేమని.. తమ రాజీనామాలు ఆమోదించాలంటూ మంగళవారం తహసీల్దార్‌ విజయ్‌భాస్కర్‌, ఎంపీడీవో గౌరికి వేర్వేరుగా వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. రెండు నెలలుగా జీతాలు ఇవ్వకపోతే కుటుంబాలు ఎలా పోషించాలని ప్రశ్నించారు. ఇప్పటికే మండలంలో ముగ్గురు ఆపరేటర్లు తమ ఉద్యోగానికి రాజీనామా చేశారని చెప్పారు. 

Read more