ఉమ్మడి జిల్లా ఓట్ల విలువ 3,500

ABN , First Publish Date - 2022-07-18T06:44:13+05:30 IST

రాష్ట్రపతి ఎన్నికలపై ప్రజల్లో ఆసక్తి కనబడుతోంది. ఎన్నికల ఓటర్ల జాబితాలో ఎవరెవరు ఉంటారు.. జిల్లా మొత్తంపై ఎన్ని ఓట్లు ఉంటాయనే చర్చ నడుస్తోంది. వాస్తవానికి విస్తీర్ణం పరంగా చిత్తూరు ఉమ్మడి జిల్లా పెద్దది. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో ఘనమైన పాత్ర జిల్లా పోషించనుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాను యూనిట్‌గా తీసుకుని లెక్కిస్తే రాష్ట్రపతి ఎన్నికల్లో జిల్లా ఓట్ల విలువ 3500గా ఉంది.

ఉమ్మడి జిల్లా ఓట్ల విలువ 3,500

నేడు రాష్ట్రపతి ఎన్నికలు 

టేయనున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు 


చిత్తూరు కలెక్టరేట్‌, జూలై 17: రాష్ట్రపతి ఎన్నికలపై ప్రజల్లో ఆసక్తి కనబడుతోంది. ఎన్నికల ఓటర్ల జాబితాలో ఎవరెవరు ఉంటారు.. జిల్లా మొత్తంపై ఎన్ని ఓట్లు ఉంటాయనే చర్చ నడుస్తోంది. వాస్తవానికి విస్తీర్ణం పరంగా చిత్తూరు ఉమ్మడి జిల్లా పెద్దది. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో ఘనమైన పాత్ర జిల్లా పోషించనుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాను యూనిట్‌గా తీసుకుని లెక్కిస్తే రాష్ట్రపతి ఎన్నికల్లో జిల్లా ఓట్ల విలువ 3500గా ఉంది. 


ఓటర్లు వీరే..


రాష్ట్రపతిని పార్లమెంటు ఉభయ సభల సభ్యులు, శాసనసభ సభ్యులు సోమవారం జరిగే ఎన్నికల్లో ఎన్నుకోనున్నారు. నామినేట్‌ అయిన రాజ్యసభ సభ్యులకు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఉండదు. జిల్లాలో నామినేటెడ్‌ సభ్యులు లేరు. ఎమ్మెల్సీలు ముగ్గురున్నా ఓటింగ్‌లో పాల్గొనే అర్హత వారికి లేదు. ఓటింగ్‌ రహస్య పద్ధతిలో జరుగుతుంది. లోక్‌సభ సభ్యులుగా ఎం.రెడ్డప్ప(చిత్తూరు), గురుమూర్తి(తిరుపతి) ఉన్నారు. మిథున్‌రెడ్డి కడప జిల్లా ఓటరుగా ఉంటారు. ఉమ్మడి జిల్లాలోని 14 మంది ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉంటుంది. 


ఓటు విలువ..


రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటు విలువ వేర్వేరుగా ఉంటుంది. ఎమ్మెల్యేల ఓటు విలువ రాష్ట్ర జనాభా ప్రాతిపదికన నిర్ణయిస్తారు. ఈ లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యేల ఓటు విలువ 150. ఎంపీల ఓటు విలువ 700. ఈ మేరకు లెక్కిస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లా  పరిధిలోని 14 మంది ఎమ్మెల్యేల ఓటు విలువ 2100. ఎంపీల ఓటు విలువ 1400గా ఉంది. మొత్తం ఓట్ల విలువ 3500. జిల్లా పరిధిలో కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు మినహా మిగిలిన 13 మంది, ఇద్దరు ఎంపీలు వైసీపీకి చెందిన వారు. ఎన్డీయే బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకే వైసీపీ, టీడీపీ మద్దతు ప్రకటించడంతో.. ఈ ఓట్లన్నీ ఆమెకే పడనున్నాయి. 


అసెంబ్లీ ప్రాంగణంలో.. 


అమరావతిలోని అసెంబ్లీ  ప్రాంగణంలో ఎమ్మెల్యేలు ఓట్లు వేయనున్నారు. సీఎం జగన్‌ తర్వాత మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఓటు వేయడానికి ప్రాధాన్యత ఉంది. ఎంపీలు విజయవాడ అసెంబ్లీ హాలులో లేదా ఢిల్లీలని పార్లమెంటు భవన్‌లో ఓటేసే అవకాశం ఉంది. కాగా, ఎంపీలకు ఆకు పచ్చ రంగు, ఎమ్మెల్యేలకు గులాబిరంగు బ్యాలెట్‌ పత్రాలు ఉంటాయి. బ్యాలెట్‌ పత్రాల్లో రెండు కాలమ్స్‌ ఉంటాయి. అందులో ఒకటి అభ్యర్థి పేరు, రెండోది ఆర్డర్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సు. పోటీ పడుతున్న అభ్యర్థుల్లో మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరితో తప్పనిసరిగా వేయాలి. అప్పుడే ఓటు చెల్లుతుంది. రెండో ప్రాధాన్య ఓటు ఐచ్ఛికం. 

Updated Date - 2022-07-18T06:44:13+05:30 IST