1న రెండో దశ నాడు-నేడు పనులు ప్రారంభం

ABN , First Publish Date - 2022-02-23T07:00:19+05:30 IST

నాడు- నేడు కింద ఎంపికైన పాఠశాలల్లో మార్చి ఒకటో తేదీ నుంచి రెండో దశ పనులు ప్రారంభం కానున్నాయి.

1న రెండో దశ నాడు-నేడు పనులు ప్రారంభం

చిత్తూరు (సెంట్రల్‌), ఫిబ్రవరి 22: జిల్లాలో నాడు- నేడు కింద ఎంపికైన పాఠశాలల్లో మార్చి ఒకటో తేదీ నుంచి రెండో దశ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు, ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 269 పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.175 కోట్లు మంజూరు చేసింది. ఈ అంశంపై డీఈవో శేఖర్‌, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డిలు మంగళవారం ఎంఈవోలు, హెచ్‌ఎంలు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లతో సమీక్షించారు. ఈనెల 26వ తేదీలోపు పనుల అంచనా నివేదికలు ఇవ్వాలని, 27న కలెక్టర్‌ ఆమోదం తీసుకుని, మార్చి ఒకటో తేదీన పనులు చేపట్టాలని ఆదేశించారు. 

Read more