ఇక రీసర్వే పనులు వేగవంతం
ABN , First Publish Date - 2022-11-30T01:59:07+05:30 IST
ఉమ్మడి జిల్లాలో జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష రీసర్వే పనులు వేగవంతం కానున్నాయి. దీనికోసం 66 సూపర్ న్యూమరీ పోస్టులకు సీసీఎల్‌ఏ కమిషనర్ అనుమతిచ్చారు.

చిత్తూరు కలెక్టరేట్, నవంబరు 29: ఉమ్మడి జిల్లాలో జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష రీసర్వే పనులు వేగవంతం కానున్నాయి. దీనికోసం 66 సూపర్ న్యూమరీ పోస్టులకు సీసీఎల్‌ఏ కమిషనర్ అనుమతిచ్చారు. రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్లు, ఆర్‌ఐలకు తాత్కాలిక డిప్యూటీ తహసీల్దార్లుగా పదోన్నతులు కల్పిస్తూ కలెక్టర్ ఎం.హరినారాయణన్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 66 మంది సీనియర్ అసిస్టెంట్లు, ఇన్‌స్పెక్టర్లను తహసీల్దార్లుగా అప్‌గ్రేడ్ చేశారు. రీసర్వే పనులు నత్తనడకన సాగుతున్న నేపథ్యంలో మరో ఏడాది గడువులోపు రీసర్వే పనులు సమగ్రంగా పూర్తిచేసేందుకు వీలుగా తాత్కాలిక పద్ధతిలో వీరికి పదోన్నతులు కల్పించారు. ఈ పదోన్నతి కాలం రెండేళ్ళుగా నిర్ణయించారు. వీరి సర్వీసును పరిగణనలోకి తీసుకోవడం జరగదని సీసీఎల్‌ఏ కమిషనర్ ఉత్తర్వులో పేర్కొనడం గమనార్హం.
Read more