ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పుతగదు

ABN , First Publish Date - 2022-09-25T05:44:30+05:30 IST

జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హెల్త్‌ యూనివర్సిటీకి ఉన్న ఎన్టీ ఆర్‌ పేరు మార్పు తగదని టీడీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పి.అంజాద్‌ ఖాన్‌, రా జంపేట పార్లమెంట్‌ అధికార ప్రతినిధి కరీముల్లా, తెలుగు యువత అధ్యక్షుడు జి.ఇమ్రాన్‌ అన్నారు.

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పుతగదు
ప్రసంగిస్తున్న టీడీపీ నాయకులు

రొంపిచెర్ల, సెప్టెంబరు 24: జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హెల్త్‌ యూనివర్సిటీకి ఉన్న ఎన్టీ ఆర్‌ పేరు మార్పు  తగదని టీడీపీ  మైనార్టీ సెల్‌  రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పి.అంజాద్‌ ఖాన్‌, రా జంపేట పార్లమెంట్‌  అధికార ప్రతినిధి కరీముల్లా, తెలుగు యువత అధ్యక్షుడు జి.ఇమ్రాన్‌ అన్నారు. శనివారం రొంపిచెర్లలోని పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి ఇంటి వద్ద  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ... పేదల గుండెల్లో గూడు కట్టుకున్న మహానేత ఎన్టీఆర్‌ పేరు ముర్పుచేయడం రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేని చర్యగా వుందన్నా రు. ఒక ప్రభుత్వం పెట్టిన పేరు మరో ప్రభుత్వ తొలగించడం సరికాదన్నారు. ఎన్టీఆర్‌పై ప్రేమ ఉందంటూ చెప్పడం ఆయన పేరును మార్చడం ఏమిట్లో అర్థం కావడం లేదన్నారు.  తమ పార్టీ అధినేత చంద్రబాబు ఇలాంటి కార్యక్ర మాలకు ఎన్నడూ పాల్పడలేదని ఉమ్మడి రాష్ట్రంలో ఎందరో నాయకుల పేరు పెట్టిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఇప్పటికై నా సీఎం మనసు మార్చుకుని ఎన్టీఆర్‌ పేరును కొనసాగించాలన్నారు. గౌస్‌పీర్‌ఖాన్‌, సాయబ్‌పీర్‌, తులసీరాం, రామ్మూర్తి పాల్గొన్నారు.

Read more