ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ పేరు మార్పు తగదు

ABN , First Publish Date - 2022-10-02T05:11:54+05:30 IST

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూ నివర్సిటీ పేరును మార్చడాన్ని నిరసిస్తూ బైరెడ్డిపల్లె పట్టణంలో శనివారం టీడీపీ మండల అధ్యక్షుడు కిశోర్‌గౌడు, ప్రధాన కార్యదర్శి సుబ్రమ ణ్యంశెట్టి ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు.

ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ పేరు మార్పు తగదు
బైరెడ్డిపల్లెలో దీక్ష చేస్తున్న టీడీపీ నాయకులు

టీడీపీ శ్రేణుల దీక్ష


బైరెడ్డిపల్లె, అక్టోబరు 1: ఎన్టీఆర్‌ హెల్త్‌ యూ నివర్సిటీ పేరును మార్చడాన్ని నిరసిస్తూ బైరెడ్డిపల్లె పట్టణంలో శనివారం టీడీపీ మండల అధ్యక్షుడు కిశోర్‌గౌడు, ప్రధాన కార్యదర్శి సుబ్రమ ణ్యంశెట్టి ఆధ్వర్యంలో  దీక్ష చేపట్టారు. స్థానిక నాలుగు రోడ్ల కూడలి సమీపంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కిశోర్‌ గౌడు మాట్లాడుతూ... హెల్త్‌ యూ నివర్సిటీ పేరు ను వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా తొలగిం చిందని ఆరోపించారు. అరాచకపాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి  ప్రజలే తగిన గుణ పాఠం చెబుతారన్నారు. ఇప్పటికైనా ఎన్టీ ఆర్‌ యూనివర్సిటీ పేరును యథా త థంగా కొనసాగించాలని డిమాండ్‌ చేశా రు. దీక్షలో టీడీపీ, అనుబంధ సంఘాల నాయకులు సుబ్రమణ్యంశెట్టి, రఘుచం ద్రగుప్తా, మంజునాథ రెడ్డి, అమర నాథరెడ్డి, సుబ్రమణ్యం రెడ్డి, వెంకటప్ప గౌడ, రమేష్‌రెడ్డి, గోవింద స్వామి, రాజేష్‌, అరుణ్‌, భువనచంద్ర గౌడ, రమేష్‌, శ్రీని వాసులు, కృష్ణమూర్తి, నాగరాజు, సుబ్రమ ణ్యంగౌడ, గౌరప్పగౌడ, శేషుగౌడ, జలంధర్‌, దివాకర్‌రెడ్డి, గోపి, మధు తదితరులు పాల్గొన్నారు. 

Read more