తొలిరోజు 10,561 మంది పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2022-03-18T06:52:13+05:30 IST

జిల్లాలో 12-14 ఏళ్లలోపు పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌(కార్బీ వ్యాక్స్‌) గురువారం ప్రారంభించారు. తిరుపతిలోని తిరుమలరెడ్డి నగర్‌ యూహెచ్‌సీలో ఈ కార్యక్రమాన్ని డీఎంహెచ్‌వో శ్రీహరి ప్రారంభించారు.

తొలిరోజు 10,561 మంది పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌
తిరుమల రెడ్డి నగర్‌ యూహెచ్‌సీలో పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో శ్రీహరి

చిత్తూరు రూరల్‌, మార్చి 17: జిల్లాలో 12-14 ఏళ్లలోపు పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌(కార్బీ వ్యాక్స్‌) గురువారం ప్రారంభించారు. తిరుపతిలోని తిరుమలరెడ్డి నగర్‌ యూహెచ్‌సీలో ఈ కార్యక్రమాన్ని డీఎంహెచ్‌వో శ్రీహరి ప్రారంభించారు. పూత్తూరు హైస్కూల్‌లో డీఐవో రవిరాజు పిల్లలకు స్వయంగా వ్యాక్సిన్‌ వేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ.. 12-14 ఏళ్లు లోపు వారు 1.29 లక్షల మందిని గుర్తించగా.. 1.3 లక్షల డోసుల వ్యాక్సిన్‌ జిల్లాకు వచ్చిందన్నారు. వైద్యరోగ్యశాఖ మార్గదర్శకాలు ప్రకారం 0.5 ఎంఎల్‌ కార్బీ వ్యాక్స్‌ ఫస్ట్‌ డోస్‌గా వేశామన్నారు. 28 రోజుల తర్వాత రెండో డోస్‌ ఇస్తామన్నారు. తొలిరోజు 10561 మంది పిల్లలకు వ్యాక్సిన్‌ వేశామని, ఎవరికీ, ఎలాంటి దుష్ప్రభావాలు కలగలేదని వారు చెప్పారు. కార్బీ వ్యాక్స్‌ వందశాతం సురక్షితమేనని, తల్లిదండ్రులు ముందుకు వచ్చి పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించాలని కోరారు. ఎంఈవోలు, ఉపాధ్యాయులు చొరవ తీసుకుని వంద శాతం వ్యాక్సినేషన్‌కు సహకరించాలన్నారు. 

Read more