హైకోర్టు తీర్పు హర్షణీయం

ABN , First Publish Date - 2022-03-04T05:47:21+05:30 IST

అమరావతి రాజధాని వ్యాజ్యాలపై హైకోర్టు తీర్పును టీడీపీ శ్రేణులు స్వాగతించాయి

హైకోర్టు తీర్పు హర్షణీయం
చిత్తూరులో కేక్‌ కట్‌చేసి సంబరాలు

అమరావతి రాజధాని వ్యాజ్యాలపై హైకోర్టు తీర్పును టీడీపీ శ్రేణులు స్వాగతించాయి.రెండేళ్లుగా ఆ ప్రాంత రైతులు జరిపిన అవిశ్రాంత ఆందోళనలకు ఫలితం దక్కిందంటూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. చిత్తూరులో, శ్రీకాళహస్తిలో  కేక్‌ కట్‌చేసి సంబరాలు జరుపుకున్న టీడీపీ నాయకులు తిరుపతిలో అలిపిరి పాదాల మండపం వద్ద 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. సీపీఐ,జనసేన పార్టీల ప్రతినిధులు హర్షం ప్రకటించారు. Read more