గర్భిణుల ఆరోగ్యంపై పర్యవేక్షణ ఉండాలి

ABN , First Publish Date - 2022-11-30T00:10:23+05:30 IST

గర్భిణుల ఆరోగ్యంపై వైద్యాధికారులు, సిబ్బంది నిరంతర పర్యవేక్షణ ఉండాలని డీఐవో రవిరాజు అదేశించారు.

గర్భిణుల ఆరోగ్యంపై పర్యవేక్షణ ఉండాలి
సమావేశంలో మాట్లాడుతున్న డీఐవో రవిరాజు

చిత్తూరు రూరల్‌, నవంబరు 29: గర్భిణుల ఆరోగ్యంపై వైద్యాధికారులు, సిబ్బంది నిరంతర పర్యవేక్షణ ఉండాలని డీఐవో రవిరాజు అదేశించారు. మంగళవారం చిత్తూరు డీఎంహెచ్‌వో కార్యాలయంలో మాతృ, శిశు మరణాలపై ఆయన సమీక్షించారు. గర్భిణుల వివరాలను తప్పని సరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. మొదటి సారి గర్భం దాల్చిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సకాలంతో అన్ని వైద్య పరీక్షలు చేయాలన్నారు. హైరిస్క్‌ గర్భిణులను గుర్తించి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. తక్కువ బరువుతో, పోషకాహార లోపం, రక్తహీనతతో పుట్టిన పిల్లల పట్ల వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

Updated Date - 2022-11-30T00:10:25+05:30 IST