5వేలమందికి ఉద్యోగాలే లక్ష్యం

ABN , First Publish Date - 2022-11-25T00:10:38+05:30 IST

శ్రీరంగరాజపురం మండలం కొటార్లపల్లె వద్ద ఏర్పాటు చేయనున్న స్మార్ట్‌ డీవీ కంపెనీలో 5వేలమందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఆ కంపెనీ చైర్మన్‌ దీపక్‌కుమార్‌ తాళ్ళ పేర్కొన్నారు.

5వేలమందికి ఉద్యోగాలే లక్ష్యం
మాట్లాడుతున్న దీపక్‌కుమార్‌, పక్కన విజయానందరెడ్డి, ఆరణి శ్రీనివాసులు

స్మార్ట్‌ డీవీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ చైర్మన్‌ దీపక్‌కుమార్‌ వెల్లడి

గంగాధరనెల్లూరు, నవంబరు 24: శ్రీరంగరాజపురం మండలం కొటార్లపల్లె వద్ద ఏర్పాటు చేయనున్న స్మార్ట్‌ డీవీ కంపెనీలో 5వేలమందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఆ కంపెనీ చైర్మన్‌ దీపక్‌కుమార్‌ తాళ్ళ పేర్కొన్నారు. గంగాధరనెల్లూరు మండలం అగరమంగళం అంకాలపరమేశ్వరి ఆలయం వద్ద గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ కంపెనీలో ఉద్యోగాలకు డిసెంబరు 24న నిర్వహించే రాత పరీక్షలకు అర్హులైన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందులో ఎంపికైన వారికి వచ్చే ఏడాది జూలైలో ఉద్యోగాలు ఇస్తామన్నారు. మొదటి దశలో 600 మందిని ఎంపిక చేస్తామన్నారు. మెట్రో సిటీలను వదిలి మారుమూల గ్రామమైన కొటార్లపల్లె వద్ద స్మార్ట్‌ డీవీ కంపెనీ ఏర్పాటుకు దీపక్‌కుమార్‌ తాళ్ళ ముందుకు రావడం అభినందనీయమని ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ ఎం.సి.విజయానందరెడ్డి పేర్కొన్నారు. ఆ సంస్థ తరపున సీబీఎస్‌ సిలబ్‌సతో తక్కువ ఫీజుతో విద్యాసంస్థను ప్రారంభించనున్నారని వివరించారు. అంకాళపరమేశ్వరి ఆలయాన్ని పర్యాటకంగా దీపక్‌కుమార్‌ తీరిదిద్దడం హర్షణీయమని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర గ్రీన్‌ అండ్‌ బ్యూటీఫికేషన్‌ డైరెక్టర్‌ గుణశేఖర్‌రెడ్డి, ఆలయకమిటీ మెంబర్‌ నరసింహారెడ్డి, ఆలయట్రస్ట్‌ పీఎ హరేరామ్‌, కన్‌స్ట్రక్షన్‌ మేనేజర్‌ రామ్మూర్తి, వైసీపీ నేతలు దుద్దుకూరు దాముశెట్టి, కె.పి.శ్రీధర్‌, శంకరయ్యగుంట అన్బు, రాసనపల్లె ప్రకాష్‌, కో ఆప్షన్‌ మెంబరు ఆను, డిల్లీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T00:10:38+05:30 IST

Read more