-
-
Home » Andhra Pradesh » Chittoor » The burden of high charges on the people-MRGS-AndhraPradesh
-
ప్రజలపై అధిక చార్జీల బాదుడు
ABN , First Publish Date - 2022-09-18T04:49:54+05:30 IST
వైసీపీ ప్రభుత్వం ప్రజలపై అధిక ఛార్జీల బాదుడు బాదుతోందని ఎమ్మెల్సీ దొరబాబు అన్నారు. శనివారం 47వ డివిజన్ ఓబనపల్లి కాలనిలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఎమ్మెల్సీ దొరబాబు
చిత్తూరు సిటీ, సెప్టెంబరు 17: వైసీపీ ప్రభుత్వం ప్రజలపై అధిక ఛార్జీల బాదుడు బాదుతోందని ఎమ్మెల్సీ దొరబాబు అన్నారు. శనివారం 47వ డివిజన్ ఓబనపల్లి కాలనిలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించిందని అన్నారు. అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని అప్పుల ఆంద్రప్రదేశ్‌గా మార్చిందని చెప్పారు. ఆదాయం కోసం ప్రజలపై వివిధ రకాల పన్నులను మోపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలు, విద్యుత్ ఛార్జీలు, బస్సు ఛార్జీలు, పన్నులతో ప్రజలు సతమతమవుతున్నారని చెప్పారు. ఒక్క అవకాశం ఇవ్వాలని కోరిన సీఎం జగన్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసంచేస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కార్యక్రమంలో మాజీమేయర్ కటారి హేమలత, పార్టీ రాష్ట్ర బీసీసెల్ ప్రధాన కార్యదర్శి షణ్ముగం, నేతలు సుబ్రి, మోహన్‌రాజ్, రాజశేఖర్, కంద, మురుగ, వరదరాజులు, సురే్‌షబాబు, జహంగీర్ ఖాన్, కిషోర్, కటారి కిరణ్, గోపి, మణి తదితరులు పాల్గొన్నారు.