‘కుట్టు’కు వచ్చిన బ్యాగులు

ABN , First Publish Date - 2022-08-18T06:29:53+05:30 IST

జగనన్న విద్యా కానుక పేరిట ఇచ్చిన స్కూలు బ్యాగులు అప్పుడే కుట్టు మిషన్ల వద్దకు చేరాయి. ఇలా కుప్పంలో ఓ కుట్టుమిషన్‌ వద్ద బ్యాగులు కుట్లు చిరిగి, జిప్పులు తొలగి కనిపించాయి. వీటిని నెల కిందటే ప్రజాప్రతినిధులు విద్యార్థులకు అట్టహాసంగా పంపిణీ చేశారు.

‘కుట్టు’కు వచ్చిన బ్యాగులు
కుప్పంలోని ఓ కుట్టుమిషన్‌ వద్ద కనిపించిన విద్యాకానుక బ్యాగులు - చిరిగిన కుట్టు

జగనన్న విద్యా కానుక పేరిట ఇచ్చిన స్కూలు బ్యాగులు అప్పుడే కుట్టు మిషన్ల వద్దకు చేరాయి. ఇలా కుప్పంలో ఓ కుట్టుమిషన్‌ వద్ద బ్యాగులు కుట్లు చిరిగి, జిప్పులు తొలగి కనిపించాయి. వీటిని నెల కిందటే ప్రజాప్రతినిధులు విద్యార్థులకు అట్టహాసంగా పంపిణీ చేశారు. వీటిని పంచిపెట్టి నెల్లాళ్లు కూడా కాకుండానే స్కూలు బ్యాగులు ఎక్కడికక్కడ కుట్లు ఊడిపోతున్నాయి. చిరిగి పోతున్నాయి. జిప్పులు నిలవడంలేదు. అసలు స్టాకు వచ్చినప్పుడే చాలా బ్యాగుల్లో ఈ లోపాలు ఉన్నాయి. ఉచితంగా ఇస్తున్నవే కదా అని తీసేసుకుని ఎక్కడో ఒకచోట పదో పరకో ఇచ్చి బాగు చేయించుందామనుకుంటే, ఇప్పుడేమో కుట్ల వద్ద చిరిగిపోతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ఒక్కో బ్యాగుకు జిప్పు వేసి, కుట్లు కుట్టడానికి కనీసం రూ.50 నుంచి రూ.70 దాకా వసూలు చేస్తున్నారు. ఇంకో యాభయ్యో వందో వేస్తే కొత్త బ్యాగే వస్తుంది కదా అని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆమాత్రం ఖర్చు భరించలేని పేదలు పాడైపోయిన బ్యాగులనే విద్యార్థులకిచ్చి పంపుతున్నారు. 

- కుప్పం


Updated Date - 2022-08-18T06:29:53+05:30 IST