-
-
Home » Andhra Pradesh » Chittoor » The aim is to develop the Kanipaka temple-NGTS-AndhraPradesh
-
కాణిపాక ఆలయాభివృద్ధే లక్ష్యం
ABN , First Publish Date - 2022-10-11T06:45:09+05:30 IST
కాణిపాక వరసిద్ధుడి ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని నూతన ఈవో రాణాప్రతాప్ పేర్కొన్నారు.

నూతన ఈవో రాణాప్రతాప్
ఐరాల(కాణిపాకం), అక్టోబరు 10: ఒక సేవకుడిలా పనిచేస్తూ కాణిపాక వరసిద్ధుడి ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని నూతన ఈవో రాణాప్రతాప్ పేర్కొన్నారు. సోమవారం కాణిపాకానికి వచ్చిన ఆయన తొలుత వరసిద్ధుడిని దర్శించుకున్నారు. అనంతరం కార్యాలయానికి వచ్చి బాధ్యతలు తీసుకున్నారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారిస్తానన్నారు. ధర్మకర్తల మండలి సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. అనంతరం ఆలయ సిబ్బంది ఆయన్ను సన్మానించారు. అభిషేకం టికెట్ల ధర విషయంలో గత ఈవో సురేష్‌బాబుపై వేటుపడిన పడిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈఈ వెంకటనారాయణ, ఏఈవోలు విద్యాసాగర్‌రెడ్డి, రవీంద్రబాబు, ఎస్వీ.కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.