-
-
Home » Andhra Pradesh » Chittoor » TDP minority leaders protest in front of the Collectorate-NGTS-AndhraPradesh
-
కలెక్టరేట్ ఎదుట టీడీపీ మైనార్టీ నేతల నిరసన
ABN , First Publish Date - 2022-07-05T05:45:06+05:30 IST
ఎన్నికల ముందు ముస్లింలకు పలు హామీ లిచ్చిన వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి రా గానే మొండిచేయి చూ పారని కుప్పం నియోజ కవర్గ టీడీపీ మైనార్టీ విభాగం ఉపాధ్యక్షుడు ఉమర్‌షేక్, రాష్ట్ర కార్యదర్శి ఉమర్‌షేక్ పేర్కొన్నారు.

రామకుప్పం, జూలై 4: ఎన్నికల ముందు ముస్లింలకు పలు హామీ లిచ్చిన వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి రా గానే మొండిచేయి చూ పారని కుప్పం నియోజ కవర్గ టీడీపీ మైనార్టీ విభాగం ఉపాధ్యక్షుడు ఉమర్‌షేక్, రాష్ట్ర కార్యదర్శి ఉమర్‌షేక్ పేర్కొన్నారు. సోమవారం కుప్పం నియోజకవర్గ టీడీపీ మైనార్టీలతో కలిసి చిత్తూరు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ పాలనలో దుల్హన్ పథకం, రంజాన్‌తోఫా, మసీదుల మరమ్మతులు, మౌజన్లకు నెలసరివేతనాలు, ముస్లిం విదేశీ విద్య, నిరుపేద ముస్లింకు ఉపకార వేతనాలు, షాదీమహళ్ల నిర్మాణం, హజ్‌హౌస్ సంక్షేమనిధి, ముస్లిం మహిళలకు 90శాతం రాయితీలో కుట్టుమెషిన్ల పంపిణీ వంటి కార్యక్రమాలతో పాటూ వక్ఫ్‌బోర్డు ఆస్తుల పరిరక్షణ చేపట్టిందన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే అవన్నీ అటకెక్కాయన్నారు. దుల్హన్ పథకం కింది ముస్లిం యువతుల వివాహాలకు రూ.లక్ష ఇస్తామని చెప్పి ఒక్కరూపాయి కూడా ఇవ్వడం లేదన్నారు. ఆ పథకం నిర్వహణకు నిధులు లేవని చెప్పడం ముస్లిం మైనారీటీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థమవుతోందన్నారు. అనంతరం కల్టెరుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జాకీర్, జహీర్‌అహ్మద్, ఖాసీం, ఆదిల్, నిసార్, అహ్మద్‌సర్దార్, నవాబ్ తదితరులు పాల్గొన్నారు.