బీసీల సంక్షేమమే టీడీపీ లక్ష్యం

ABN , First Publish Date - 2022-09-20T05:03:22+05:30 IST

బీసీల సంక్షేమం, అభివృద్ధి తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఆ పార్టీ కుప్పం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పి.ఎస్‌.మునిరత్నం అన్నారు.

బీసీల సంక్షేమమే టీడీపీ లక్ష్యం
కుప్పంలో బీసీ సెల్‌ లోగో ఆవిష్కరిస్తున్న టీడీపీ నేతలు

కుప్పం, సెప్టెంబరు 19: బీసీల సంక్షేమం, అభివృద్ధి తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఆ పార్టీ కుప్పం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పి.ఎస్‌.మునిరత్నం అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం పార్టీ బీసీ సెల్‌ కమిటీ సమావేశం జరిగింది. కుప్పం నియోజకవర్గ బీసీ సెల్‌ అధ్యక్షుడు మురళి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ బీసీ సెల్‌ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మునిరత్నం మాట్లాడుతూ... ఎన్టీఆర్‌ ఆధ్వర్యంలో బీసీల చెమట బిందువుల నుంచి టీడీపీ పుట్టిందన్నారు.  పేద, బడుగు, బలహీన వర్గాలకు టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చే సమయం ఇక ఎంతో దూరంలో లేదని, అప్పుడు బీసీలకు స్వర్ణయుగం తిరిగి వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకర్గ బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి వెంకరమణ, అన్ని మండలాల బీసీ సెల్‌ అధ్యక్షులు సతీశ్‌, ఉదయ్‌కుమార్‌, వేలు, శరవణకుమార్‌తోపాటు అన్ని మండలాల బీసీ కమిటీ సభ్యులు, కుప్పం రూరల్‌ మండల పార్టీ అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌, ఎంపీటీసీ మాజీ సభ్యులు సాంబశివం, డాక్టర్‌ వెంకటేశ్‌, మునిరాజు, ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ సత్యేంద్రశేఖర్‌, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు మణి, రాజగోపాల్‌, రామచంద్ర, రాణిపాకం వెంకటేశ్‌, గిరి, అశోక్‌, పార్థ, చలం తదితరులు పాల్గొన్నారు.


Read more