తమిళ సినీ నటి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-09-19T06:36:47+05:30 IST

తమిళ సినీ నటి దీప అలియాస్‌ ఫౌలిన్‌ జెస్సికా(29) ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె విరుగంబాక్కంలో తానుంటున్న ఫ్లాట్‌లోనే ఫ్యాన్‌కు ఉరేసుకున్నారు. సత్యవేడు మండలంలోని కొత్తమారికుప్పం పంచాయతీ ఇంద్రానగర్‌కు చెందిన అమల్‌నాథన్‌ కుమార్తె అయిన ఈమె తమిళ చిత్ర పరిశ్రమలో చిన్న, చిన్న పాత్రల్లో నటిస్తూ సహాయనటి నుంచి హీరోయిన్‌ స్థాయికి ఎదిగారు.

తమిళ సినీ నటి ఆత్మహత్య
దీప(ఫైల్‌ఫొటో)

ప్రేమ విఫలమే కారణమా?


స్వస్థలం సత్యవేడు మండలంలోని  కొత్తమారికుప్పం పంచాయతీ ఇంద్రానగర్‌


సత్యవేడు/చెన్నై, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): తమిళ సినీ నటి దీప అలియాస్‌ ఫౌలిన్‌ జెస్సికా(29) ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె విరుగంబాక్కంలో తానుంటున్న ఫ్లాట్‌లోనే ఫ్యాన్‌కు ఉరేసుకున్నారు. సత్యవేడు మండలంలోని కొత్తమారికుప్పం పంచాయతీ ఇంద్రానగర్‌కు చెందిన అమల్‌నాథన్‌ కుమార్తె అయిన ఈమె తమిళ చిత్ర పరిశ్రమలో చిన్న, చిన్న పాత్రల్లో నటిస్తూ సహాయనటి నుంచి హీరోయిన్‌ స్థాయికి ఎదిగారు. ‘వాళ్‌కై’, ‘వాయిదా’ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు. విశాల్‌ హీరోగా నటించిన ‘తుప్పరివాళన్‌’లో సహాయ నటి పాత్ర పోషించారు. అలాగే, మరికొన్ని చిత్రాల్లోనూ నటిస్తున్నారు. విరుగంబాక్కంలోని మల్లిగై అపార్ట్‌మెంటులో ఆమె రెండేళ్లుగా నివసిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం తన ఫ్లాట్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులు ఎప్పటిలాగే ఫోన్‌ చేయగా ఎంత సేపటికి తీయకపోవడంతో చెన్నైలో ఉంటున్న దీప స్నేహితుడు ప్రభాకరన్‌ సమాచారం ఇచ్చారు. ఆయన ఫ్లాట్‌లోకి వెళ్లి చూడగా ఫ్యానుకు ఉరేసుకుని కనిపించడంతో ఆమె సోదరుడు రమే్‌షకు సమాచారం ఇచ్చారు. ఆయన ఫిర్యాదు మేరకు కోయంబేడు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని, దీప డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు.. ‘ఈ ప్రపంచం నాకు నచ్చలేదు. ఎవరూ అండగా లేరు. ఈ కారణంగానే నేను బలవన్మరణానికి పాల్పడుతున్నా’ అని తన స్నేహితులకు ఆమె ఎస్‌ఎంఎస్‌ పంపించినట్టు తెలుస్తోంది. అలాగే ఏడాదిగా ఒకరిని ప్రేమించానని, కానీ, ఆ వ్యక్తి తన ప్రేమను అంగీకరించక పోవటంతో తీవ్ర మనోవేదనకు లోనయ్యానని ఓ లేఖలో పేర్కొన్నారు. దాంతో దీప ప్రేమించిన వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అలాగే తమ బిడ్డ మృతిపై అనుమానాలు ఉన్నాయని, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కుటుంబ సభ్యులు కోరారు. సోమవారం ఆమె అంత్యక్రియలు స్వగ్రామం ఇంద్రానగర్‌లో జరగనున్నాయి. నటులు నాజర్‌, విశాల్‌ రానున్నట్లు సమాచారం. 


Read more