జగనన్న విద్యాదీవెన పథకాన్ని సద్వినియోగం చేసుకోండి

ABN , First Publish Date - 2022-11-12T02:20:29+05:30 IST

జగనన్న విద్యాదీవెన పథకాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారి చెన్నయ్య కోరారు.

జగనన్న విద్యాదీవెన పథకాన్ని సద్వినియోగం చేసుకోండి

తిరుపతి(తిలక్‌రోడ్‌), నవంబరు 11: జగనన్న విద్యాదీవెన పథకాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారి చెన్నయ్య కోరారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2021 -22 విద్యాసంవత్సరానికి గాను జగనన్న విద్యాదీవెన పథకానికి 4వ విడత నిధులు మంజూరుకు సీఎం జగన్‌ 22న షెడ్యుల్‌ ఖరారు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు ఈ నెల 15వ తేదీ సచివాల యాల ద్వారా బయోమెట్రిక్‌ నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. అనర్హుల జాబితాలోని విద్యార్థులు వారి అర్హతకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సచివాలయాల్లో సమర్పించాలని తెలియజేశారు. 17వ తేదీలోపు అభ్యంతరాలను నమోదు చేసేందుకు అవకాశం కల్పించినట్లు వివరించారు.

Updated Date - 2022-11-12T02:20:31+05:30 IST