వార్డు కార్యదర్శి సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2022-12-12T23:42:13+05:30 IST

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ప్రజల నుంచి అందిన ఫిర్యాదు మేరకు చిత్తూరు నగరం 28వ వార్డు సచివాలయ కార్యదర్శి సతీ్‌షకుమార్‌ను సోమవారం సస్పెండు చేశారు.

 వార్డు కార్యదర్శి సస్పెన్షన్‌

చిత్తూరు, డిసెంబరు 12: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ప్రజల నుంచి అందిన ఫిర్యాదు మేరకు చిత్తూరు నగరం 28వ వార్డు సచివాలయ కార్యదర్శి సతీ్‌షకుమార్‌ను సోమవారం సస్పెండు చేశారు. సతీ్‌షకుమార్‌పై కమిషనర్‌కు పలు ఫిర్యాదులు అందాయి. దీనిపై సహాయక కమిషనర్‌ను విచారణాధికారిగా నియమించారు. విచారణాధికారి నివేదిక ప్రకారం సస్పెండ్‌ చేసినట్లు కమిషనర్‌ తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా, ప్రజలతో అమర్యాదగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - 2022-12-12T23:42:13+05:30 IST

Read more