డ్రిప్‌కు అర్హులైన రైతుల భూములు సర్వే చేయండి

ABN , First Publish Date - 2022-09-30T05:35:33+05:30 IST

ఆర్‌బీకే కేంద్రాలలో మైక్రో ఇరిగేషన్‌ ద్వారా సాగు చేసేందుకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న రైతుల భూములను ప్రాథమిక సర్వే చేయాలని ఏపీ మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు పీడీ మధుసూదనరెడ్డి పేర్కొన్నారు.

డ్రిప్‌కు అర్హులైన రైతుల భూములు సర్వే చేయండి
సమావేశంలో మాట్లాడుతున్న ఏపీఎంఐపీ పీడీ మధుసూధన్‌రెడ్డి

ఏపీఎంఐపీ పీడీ మధుసూదన్‌రెడ్డి

చిత్తూరు (సెంట్రల్‌), సెప్టెంబరు 29: ఆర్‌బీకే కేంద్రాలలో మైక్రో ఇరిగేషన్‌ ద్వారా సాగు చేసేందుకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న రైతుల భూములను ప్రాథమిక సర్వే చేయాలని ఏపీ మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు పీడీ మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన తన కార్యాలయంలో గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ ఉద్యాన సహాయకులతో సమావేశమయ్యారు. పీడీ మాట్లాడుతూ జిల్లాలో మైక్రో పరికరాల కోసం 11,588 మంది రిజిష్ట్రేషన్‌ చేసుకున్నారని, ఇందులో 3,100మంది రైతుల భూములు ప్రాథమిక సర్వే పూర్తి చేయగా, మిగిలిన 8,488 మందివి చేయాల్సి ఉందన్నారు. 2022-23 సంవత్సరానికి నిర్దేశించిన 9,800 హెక్టార్ల లక్ష్యం సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ సహాయ అధికారి కోటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


Read more