ఎస్వీయూలో పీజీ సీట్ల భర్తీకి 3న స్పాట్‌ అడ్మిషన్లు

ABN , First Publish Date - 2022-12-30T01:18:09+05:30 IST

ఎస్వీయూలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంఈడీ కోర్సుల్లో ప్రవేశానికి జనవరి 3వ తేదీన స్పాట్‌ అడ్మిషన్లు చేపట్టనున్నారు.విద్యార్థులు నేరుగా ఆయా కాలేజీల ప్రిన్సిపాల్‌ కార్యాలయిల్లో ఉదయం 9 గంటల నుంచి సంప్రదించవచ్చు.

ఎస్వీయూలో పీజీ సీట్ల భర్తీకి 3న స్పాట్‌ అడ్మిషన్లు

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), డిసెంబరు 29: ఎస్వీయూలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంఈడీ కోర్సుల్లో ప్రవేశానికి జనవరి 3వ తేదీన స్పాట్‌ అడ్మిషన్లు చేపట్టనున్నారు.విద్యార్థులు నేరుగా ఆయా కాలేజీల ప్రిన్సిపాల్‌ కార్యాలయిల్లో ఉదయం 9 గంటల నుంచి సంప్రదించవచ్చు. ఏపీపీజీసెట్‌-2022లో ర్యాంకులు పొందిన విద్యార్థులే అర్హులు.మొదటి, రెండవ విడత అడ్మిషన్లు పూర్తవడంతో సీట్లు పొందని వారికి కన్వీనర్‌ కోటాలో అవకాశం కల్పించనున్నారు.వివరాల కోసం.. ఎస్వీ యూనివర్సిటీ.ఇన్‌. వెబ్‌సైట్‌ను చూడవచ్చునని మీడియా కో-ఆర్డినేటర్‌ వేంకటేశ్వర్లు తెలిపారు.

Updated Date - 2022-12-30T01:18:09+05:30 IST

Read more