‘స్పందన’ కరువు

ABN , First Publish Date - 2022-04-05T06:40:49+05:30 IST

సోమవారం జరిగిన ‘స్పందన’ కార్యక్రమం బోసిపోయింది.

‘స్పందన’ కరువు
బోసిపోయిన ‘స్పందన’ కౌంటర్లు

చిత్తూరు, ఏప్రిల్‌ 4: బారులు తీరిన ప్రజలు.. అర్జీలు స్వీకరించి పరిశీలించే అధికారులు.. వివిధ సమస్యలపై వచ్చే నాయకులు.. తమ డిమాండ్లు నెరవేర్చాలని, సమస్యల పరిష్కారానికి చేపట్టే ఆందోళనలు.. వీటితో ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ‘స్పందన’ కార్యక్రమం రద్దీగా ఉండేది. మూడు నెలలుగా ఆందోళనలు పెరగడంతో కలెక్టరేట్‌ పోలీసుల వలయంలో ఉండేది. అలాంటిది ఈ సోమవారం జరిగిన ‘స్పందన’ కార్యక్రమం బోసిపోయింది. కలెక్టరేట్‌ పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. కలెక్టరేట్‌తో పాటు ఇతర శాఖల నుంచి బదిలీ అయిన ఉద్యోగులంతా సోమవారం వెళ్లి ఆయా జిల్లాల్లో బాధ్యతలు స్వీకరించారు. ఇన్నాళ్లు తమతో కలిసి పనులు చే సిన  సహ ఉద్యోగులంతా ఒక్కసారిగా వెళ్లిపోవడంతో మిగిలిన వారిలో నిర్వేదం కనిపించింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగే స్పందన కార్యక్రమం సోమవారం 11.45 గంటలకే వచ్చిన ఒకరిద్దరూ కూడా వెళ్లిపోయారు. దాంతో స్పందన కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లన్నీ వెలవెలపోయాయి. ఉమ్మడి జిల్లాలో జరిగిన స్పందన కార్యక్రమానికి 300-400 మంది హాజరుకాగా.. ప్రస్తుతం వందలోపే అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 

Read more