షార్‌లో అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-10-05T04:50:38+05:30 IST

ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ కేంద్రంలోని ఎంఆర్‌ కురుఫ్‌ ఆడిటోరియంలో మంగళ వారం తమిళనా డు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ప్రారంభించారు.

షార్‌లో అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభం
జ్యోతి ప్రజ్వలన చేసి అంతరిక్ష వారోత్సవాలను ప్రారంభిస్తున్న తమిళనాడు గవర్నర్‌

 సూళ్లూరుపేట, అక్టోబ రు 4: ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ కేంద్రంలోని ఎంఆర్‌ కురుఫ్‌ ఆడిటోరియంలో మంగళ వారం తమిళనా డు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్‌  మాట్లాడుతూ అంతరిక్ష ఫలాలను సామాన్యుడి చెంతకు తీసుకెళ్లేందుకు శాస్త్రవేత్తల చేస్నున్న కృషి అభినందనీయమ న్నారు. ప్రారంభానికి విచ్చేసిన గవర్నర్‌కు షార్‌ డైరెక్టర్‌ రాజరాజన్‌, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా షార్‌ డైరెక్టర్‌ మాట్లాడుతూ ప్రతియేటా ఒక ప్రత్యేక టీమ్‌తో వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మానవాళికి అవసరమైన సాంకేతిక అవసరాలను అంతరిక్ష ప్రయోగాల ద్వారా అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం విద్యార్ధులలు కూడా శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆశక్తి చూపుతున్నారని అందులో భాగంగానే వారిని ప్రోత్సహించేందుకు రాకెట్‌ ప్రయోగాల్లో వారు రూపొందించిన చిన్నచిన్న ఉపగ్రహాలను సైతం పంపుతున్నామని తెలిపారు. ఇక్కడి ఉద్యోగులతో పాటు ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యంతో అంతరిక్ష పరిశోధనల్లో ముందుకు దూసుకెళ్లెందుకు ఎంతో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో షార్‌ కంట్రోలర్‌ శ్రీనివాసుల రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్‌ సెంథిల్‌కుమార్‌, రఘురామ్‌, గ్రూపు డెరెక్టర్‌ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Read more