ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించండి: ఫ్యాప్టో

ABN , First Publish Date - 2022-05-18T07:01:16+05:30 IST

విద్యారంగం, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించండి: ఫ్యాప్టో

చిత్తూరు (సెంట్రల్‌), మే 17: విద్యారంగం, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. చిత్తూరులోని పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం నిర్వహించే పీసీఆర్‌ ఉన్నత పాఠశాల ముందు మంగళవారం నిరసన తెలిపారు. ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత ప్రభుత్వం విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చి వ్యవస్థలను అస్తవ్యస్తం చేయడం దారుణమన్నారు. అనవసరమైన వాటిని తెరపైకి తేవడంతో బోధన విధానం పక్కదారి పడుతోందన్నారు. జీపీఎస్‌ వద్దని, అదే విధంగా సీపీఎ్‌సను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలింపును ఆపేసి ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు. 11వ పీఆర్సీ జీవోలోని అసంబద్ధాలను సరిచేయాలన్నారు. గతంలో 50 మార్కులకు ఇచ్చే స్పాట్‌ రేటును నేడు వంద మార్కులకు చేస్తున్నా, ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. ఈ సమస్యలపై డీఈవో పురుషోత్తంకు వినతి పత్రం సమర్పించారు. ఫ్యోప్టో నాయకులు గంటా మోహన్‌, గోపీనాథ్‌, రమణ, నాదముని, ముస్తార్‌, సుధాకర్‌, రమేష్‌, చెంగల్రాయ మందడి, మురళి, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-18T07:01:16+05:30 IST