టీడీపీ ఓటర్లను కాపాడుకోవడానికే సేవామిత్రలు

ABN , First Publish Date - 2022-10-11T05:59:56+05:30 IST

రానున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా టీడీపీ ఓటర్ల పేర్లను జాబితాలో నుంచి తొలగిపోకుండా కాపాడుకోవడానికే సేవమిత్రలను ఏర్పాటుచేస్తున్నట్లు

టీడీపీ ఓటర్లను కాపాడుకోవడానికే సేవామిత్రలు
సేవామిత్రలకు బుక్‌లు పంపిణీచేసిన టీడీపీనేతలు

గంగాధరనెల్లూరు: రానున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా టీడీపీ ఓటర్ల పేర్లను జాబితాలో నుంచి తొలగిపోకుండా కాపాడుకోవడానికే సేవమిత్రలను ఏర్పాటుచేస్తున్నట్లు చిత్తూరు పార్లమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రగుంట్ల క్రిష్ణమనాయుడు, మండల అధ్యక్షుడు స్వామిదాస్‌, పార్లమెంట్‌ ఎస్సీ సెల్‌ ప్రధానకార్యదర్శి దేవసుందరం అన్నారు. తూగుండ్రం పంచాయతీలోని పోలింగ్‌ కేంద్రాల్లో ప్రతి వంద ఓట్లకి ఒక సేవామిత్ర లెక్కన 40 మందిని ఏర్పాటు చేసి వారికి ఓటర్ల జాబితాను పంపిణీచేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో వివిధ ఎన్నికలకు ముందు టీడీపీ వారి ఓట్లను తొలగించేందుకు వైసీపీ కుట్రలు చేసిందన్నారు. అలా జరగకుండా సేవామిత్రలను నియమించామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు నరసింహులునాయుడు, నియాజ్‌అలీ, నీరజాక్షులురెడ్డి, సుధాకర్‌శెట్టి, సుధాకర్‌నాయుడు, జీవరత్నం, శాంతకుమార్‌, కండిగ శంకర్‌, రాఘవేంద్ర, దాసరపల్లె శంకర్‌, ఫెరోజ్‌అలీ, అత్తార్‌అలీ, అలీఅబ్బాస్‌, జోహార్‌ అబ్బాస్‌, సబ్దార్‌ అలీ పాల్గొన్నారు. 

Read more