28న సైన్స్‌ దినోత్సవం నిర్వహించాలి : డీఈవో

ABN , First Publish Date - 2022-02-23T06:59:17+05:30 IST

ఈనెల 28న సైన్స్‌ దినోత్సవం నిర్వహించాలని డీఈవో శేఖర్‌ తెలిపారు.

28న సైన్స్‌ దినోత్సవం నిర్వహించాలి : డీఈవో

చిత్తూరు (సెంట్రల్‌), ఫిబ్రవరి 22: జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో ఈనెల 28న సైన్స్‌ దినోత్సవం నిర్వహించాలని డీఈవో శేఖర్‌ తెలిపారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నుంచి మూడు ఉత్తమ ప్రదర్శనలను ఎంఈవోలకు తెలియజేసి.. వారి సమక్షంలో విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయాలన్నారు. ‘సర్‌ సీవీ రామన్‌ జీవిత చరిత్ర-సైన్స్‌   ఆవిష్కరణలు’ అనే అంశంపై పోటీలు నిర్వహించాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్‌ అధికారి రమణ  (సెల్‌ నెంబరు- 97018 71545)ను సంప్రదించాలన్నారు. 

Read more