వైభవంగా సత్యనారాయణ వ్రతం

ABN , First Publish Date - 2022-09-11T05:45:41+05:30 IST

కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి అనుబంధమైన వరదరాజస్వామి ఆలయంలో శనివారం పౌర్ణమిని పురస్కరించుకుని సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు.

వైభవంగా సత్యనారాయణ వ్రతం
వరదరాజ స్వామి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తున్న భక్తులు

ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 10: కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి అనుబంధమైన వరదరాజస్వామి ఆలయంలో శనివారం పౌర్ణమిని పురస్కరించుకుని సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. ఉదయం ఆలయంలోని మూలవిరాట్‌కు అభిషేకం చేసి, స్వామిని సుందరంగా అలంకరించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని ఉంచి భక్తుల ఆఽధ్వర్యంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో సురే్‌షబాబు, సూపరింటెండెంట్‌ కోదండపాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రమేష్‌, బాబు పాల్గొన్నారు.


Read more