సత్యాగ్రహ సమరంలో మన వీరులు

ABN , First Publish Date - 2022-08-10T07:04:40+05:30 IST

భారత ప్రజల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన 11 కనీస చర్యలు ప్రకటించిన గాంధీ, బ్రిటీషు ప్రభుత్వం లక్ష్యపెట్టకపోతే శాసనోల్లంఘనకు దిగుతామంటూ 1930 జనవరి 31న యంగ్‌ ఇండియా పత్రికలో హెచ్చరించారు.

సత్యాగ్రహ సమరంలో మన వీరులు

‘‘ఒకే ఒక్క కార్యకర్త ప్రాణాలతో మిగిలి ఉన్నా ఈ ఉద్యమం కొనసాగుతుంది. దీన్ని ఆపడం ఎవరితరం కాదు’’ 

శాసనోల్లంఘన ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ చేసిన ప్రకటన ఇది. భారత ప్రజల సంక్షేమం కోసం 

తీసుకోవాల్సిన 11 కనీస చర్యలు ప్రకటించిన గాంధీ, బ్రిటీషు ప్రభుత్వం లక్ష్యపెట్టకపోతే శాసనోల్లంఘనకు దిగుతామంటూ 1930 జనవరి 31న యంగ్‌ ఇండియా పత్రికలో హెచ్చరించారు. దీనికి అనుగుణంగానే  మార్చిలో శాసనోల్లంఘన ఉద్యమం మొదలైంది. విదేశీ వస్తు బహిష్కరణ, పన్నులు కట్టకుండా నిరాకరణ, అటవీ పరిరక్షణ చట్టాల అతిక్రమణ, సారా వేలం పాటల బహిష్కరణ వంటి కార్యక్రమాలు దేశమంతా జరిగాయి. ఉప్పు సత్యాగ్రహం ఈ ఉద్యమంలో భాగంగానే జరిగింది.   

ఉద్మమాన్ని అణిచివేయడానికి వేలాదిమందిని జైళ్లలో కుక్కారు. పోలీసు కాల్పుల్లో వందలాదిమంది మరణించారు. 

రెండు దశలుగా సాగిన ఈ మహోద్యమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి భారీ సంఖ్యలోనే పాల్గొన్నారు. 

అరెస్టులు జరిగాయి. ఈ ఉద్యమంలో జైలుపాలైన జిల్లావారిలో కొందరు వీరు...

ఆదికేశవ మొదలియార్‌ : వ్యవసాయదారుడైన ఈయన చంద్రగిరి నివాసి. శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని నాలుగు నెలలు వేలూరు, అలిపురం జైళ్లలో శిక్ష అనుభవించారు. రూ. 500 జరిమానా చెల్లించారు. 

సి.ఎన్‌.బాలగురునాథ గుప్త : వాయల్పాడు నివాసి. వృతి వ్యాపారం. ఉప్పు సత్యగ్రాహంలో పాల్గొని ఆరు నెలలు మద్రాసు, అలిపురం జైళ్లలో శిక్ష అనుభవించారు. 

ఎన్‌.బాలసుబ్బరామదాసు : ఇతని స్వస్థలం శ్రీకాళహస్తి.ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని మద్రాసు సెంట్ర ల్‌ జైలులో మూడు నెలలు శిక్ష అనుభవించారు. 

ఎం.దూర్వాసులు నాయుడు:విద్యార్థిగా  శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని ఆరు నెలలు శిక్ష అనుభవించారు. 

టి.కన్నయ్య: శ్రీకాళహస్తి నివాసి.ఏడున్నర సంవత్సరాల సుదీర్ఘకాలం జైలు శిక్ష అనుభవించారు. 

కేశవ శర్మ : తిరుపతికి చెందిన శర్మ బళ్లారి సెంట్రల్‌ జైలులో ఆరు నెలలు శిక్ష అనుభవించారు. 

కె.బి. రామనాథ్‌ : వేలూరు, తిరుచిరాపల్లి జైళ్లలో శిక్ష అనుభవించారు. 

 రంగనశెట్టి: నారాయణవనం నివాసి. ఏడాది కాలం పాటు జైలు శిక్ష అనుభవించారు. 

వీరం రామచంద్రారెడ్డి : మదనపల్లె కొత్తపల్లెకు చెందిన రైతు కుటుంబానికి చెందిన ఈయన చదువుకుంటూనే ఈ ఉద్యమంలో పాల్గొని ఏడు నెలల పాటు జైలుశిక్ష అనుభవించారు. 

బి.ఎ్‌స.శర్మ : చంద్రగిరి నివాసి అయిన శర్మ నాలుగు నెలలు జైలు శిక్ష అనుభవించారు. 

ఎల్‌.సౌందరరాజ అయ్యంగార్‌ : లక్ష్మీపురం నివాసి. ఎనిమిది నెలలు బాళ్లారి సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవించారు.తరువాత క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని వేలూరు, అమరావతి జైళ్లలో శిక్ష అనుభవించారు. 

విఠల్‌ శ్రీనివాసరావు :  తిరుపతిలో రైతుకుటుంబానికి చెందిన ఈయన వేలూరు, అల్లిపురం జైళ్లలో ఆరు నెలలు శిక్ష అనుభవించారు. 

సి.శ్రీనివాసులు శెట్టి : పూతలపట్టు నివాసి. బెంగళూరు, కన్ననూర్‌ జైళ్లలో శిక్ష అనుభవించారు. 

ఎన్‌.సౌందర్యరాజన్‌ :లక్ష్మీపురం నివాసి.వేలూరు, తిరుచిరాపల్లి జైళ్లలో ఆరు నెలలు శిక్ష అనుభవించారు. 

ఎ.పి.వజ్రవేలు శెట్టి : కుప్పం నివాసి అయిన ఈయన వేలూరులో ఇంటర్‌ చదువుతుండగా గాంధీ అరెస్టుకు నిరసనగా సమ్మె చేశారు. ఫలితంగా ఈయన్ను కళాశాల నుంచి తొలగించారు. 

కుండితిమడుగు మల్‌రెడ్డి : మదనపల్లె తాలూకా చోడసముద్రం నివాసి. విద్యార్ధిగా ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఒక సంవత్సరం రాజమండ్రి, బరంపురం జైళ్లలో శిక్షను అనుభవించారు. రూ. 200జరిమానా చెల్లించారు. కుడితిపూడి పుండరీకాక్షయ్య : తిరుపతికి చెందిన రైతు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 9నెలలు రాజమండ్రి, వేలూరు, బళ్లారి జైళ్లలో శిక్ష అనుభవించారు.  టి.రామచంద్రరావు : మదనపల్లెకు చెందిన ఇతను ఉప్పు సత్యాగ్రహం కాలంలో మూడు నెలలు జైలు శిక్ష అనుభవించారు.  రాపూరు గోవిందస్వామి నాయుడు : పుత్తూరు సమీపంలోని పరమేశ్వరమంగళానికి చెందిన రైతు.. ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్నారు. కలిసి శ్రీరామరెడ్డి : వాయల్పాడుకు చెందిన రైతు. ఉప్పు సత్యాగ్రహంలో మూడు నెలల జైలు శిక్ష అనుభవించారు. డి.ఎన్‌.వల్లభరావు: మదనపల్లె నివాసి. వేలూరు జైలులో నెల రోజులు శిక్ష అనుభవించారు. ఎన్‌.ఎ్‌స.వరదాచారి: తిరుపతి నివాసి. ఆరు నెలలు తిరుచిరాపల్లె, కడలూరు జైళ్లలో శిక్ష అనుభవించారు. ఎ.వెంకటేశయ్య : చిత్తూరు నివాసి. 13నెలలు రాజమండ్రి జైలులో శిక్ష అనుభవించారు. 

Read more