విజ్ఞానాభివృద్ధికి ఆర్‌ఎ్‌ససీ చక్కని వేదిక

ABN , First Publish Date - 2022-02-23T06:47:56+05:30 IST

విద్యార్థుల్లో విజ్ఞానాభివృద్ధిని పెంపొందించడానికి రీజనల్‌ సైన్స్‌ సెంటర్‌ (ఆర్‌ఎ్‌ససీ) చక్కని వేదికగా ఉపయోగపడుతుందని ఐసర్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కేఎన్‌ గణేష్‌ పేర్కొన్నారు.

విజ్ఞానాభివృద్ధికి ఆర్‌ఎ్‌ససీ చక్కని వేదిక
మాట్లాడుతున్న ప్రొఫెసర్‌ గణేష్‌ - సైన్సు ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్న విద్యార్థులు

తిరుపతి(విద్య), ఫిబ్రవరి 22: విద్యార్థుల్లో విజ్ఞానాభివృద్ధిని పెంపొందించడానికి రీజనల్‌ సైన్స్‌ సెంటర్‌ (ఆర్‌ఎ్‌ససీ) చక్కని వేదికగా ఉపయోగపడుతుందని ఐసర్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కేఎన్‌ గణేష్‌ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తిరుపతిలోని ప్రాంతీయ విజ్ఞాన కేంద్రంలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సౌజన్యంతో ఏర్పాటుచేసిన ‘75 వసంతాల భారత స్వాతంత్య్రం- శాస్త్ర సాంకేతిక రంగాలలో విజయాలు’ వైజ్ఞానిక ప్రదర్శనను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేశంలోని శాస్త్ర సాంకేతిక వారసత్వం, గొప్పశాస్త్రవేత్తలు వారి రూపొందించిన ఆవిష్కరణలు నేటి తరానికి అందించడానికి విజ్ఞాన కేంద్రం చక్కని వేదికగా నిలుస్తుందన్నారు. ఇందులో భాగంగా అంతరిక్ష విజ్ఞానం, వైద్య, అనుసాంకేతిక, ఐటీ రంగాలకు సంబంధించిన ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలను గణే్‌షతో పాటు ఎస్వీయూ డీన్‌ ప్రొఫెసర్‌ విజయభాస్కర్‌రావు, జనవిజ్ఞాన వేదిక ప్రాంతీయ కోఆర్డినేటర్‌ షేక్‌ అమీర్‌ సందర్శించారు. ఆజాదీ కా అమృత మహోత్సవ్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన 28వ తేది వరకు ఉంటుందని ఆ కేంద్రం కోఆర్డినేటర్‌ ఎంఎంకే బాలాజీ పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శించవచ్చన్నారు. 

Read more