టీటీడీ అన్నదానానికి రూ. 10లక్షల విరాళం

ABN , First Publish Date - 2022-03-04T06:52:11+05:30 IST

టీటీడీ అన్నదాన ట్రస్టుకు రూ.10లక్షలు విరాళంగా అందింది. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును తిరుచానూరు అమ్మవారి ఆలయ ఏఈవో ప్రభాకర్‌రెడ్డికి గురువారం టీటీడీ ధర్మప్రచార పరిషత్‌ రిటైర్డ్‌ ప్రవచనకర్త, తిరుచానూరుకు చెందిన వేమూరి అన్నపూర్ణ అందజేశారు.

టీటీడీ అన్నదానానికి రూ. 10లక్షల విరాళం
చెక్కును ఏఈవోకు అందజేస్తున్న వేమూరి అన్నపూర్ణ

తిరుచానూరు, మార్చి 3: టీటీడీ అన్నదాన ట్రస్టుకు రూ.10లక్షలు విరాళంగా అందింది. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును తిరుచానూరు అమ్మవారి ఆలయ ఏఈవో ప్రభాకర్‌రెడ్డికి గురువారం టీటీడీ ధర్మప్రచార పరిషత్‌ రిటైర్డ్‌ ప్రవచనకర్త, తిరుచానూరుకు చెందిన వేమూరి అన్నపూర్ణ అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గతంలో కూడా అమ్మవారికి బంగారుహారాన్ని కానుకగా అందించినట్లు చెప్పారు. తన జీతంలో సగభాగం స్వామి, అమ్మవార్ల సేవలకు అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు శేషగిరి, మధు, వేదపండితులు నాగరాజుస్వామి పాల్గొన్నారు. 

Read more