ఐసీడీఎస్‌ సీడీపీవో కేంద్రాల పునర్వ్యవస్థీకరణ

ABN , First Publish Date - 2022-11-21T01:07:55+05:30 IST

జిల్లాలో ఐసీడీఎస్‌ పర్యవేక్షణలోని సీడీపీవో కేంద్రాల పరిఽధులను పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత బుధవారమే జీవో జారీ అయినా తాజాగా ప్రభుత్వ గెజిట్‌లో పొందుపరిచారు.

ఐసీడీఎస్‌ సీడీపీవో కేంద్రాల పునర్వ్యవస్థీకరణ

చిన్నగొట్టిగల్లు, తొట్టంబేడు, కార్వేటినగరం, బంగారుపాళ్యం కేంద్రాల రద్దు

11 సీడీపీవోల పరిధిలో 2420 అంగన్‌వాడీ కేంద్రాలు

చిత్తూరు, నవంబరు 20: జిల్లాలో ఐసీడీఎస్‌ పర్యవేక్షణలోని సీడీపీవో కేంద్రాల పరిఽధులను పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత బుధవారమే జీవో జారీ అయినా తాజాగా ప్రభుత్వ గెజిట్‌లో పొందుపరిచారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనంతరం ఒకే ఐసీడీఎస్‌ పరిధిలోని సీడీపీవో కేంద్రాలు కొన్ని ఇతర జిల్లాల పరిధుల్లోకి, అందులో మళ్లీ వేర్వేరు రెవెన్యూ డివిజన్లలోకి వెళ్ళిపోయిన కారణంగా తలెత్తుతున్న పాలనాపరమైన ఇబ్బందులను అధిగమించడానికి ఈ చర్యలు చేపట్టారు. దీంతో సీడీపీవో కేంద్రాలన్నీ ఒకే జిల్లాకు, అందులోని మండలాలన్నీ ఒకే రెవెన్యూ డివిజనుకు చేరాయి. ఫలితంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొనసాగిన చిన్నగొట్టిగల్లు, తొట్టంబేడు, కార్వేటినగరం, బంగారుపాళెం సీడీపీవో కేంద్రాలను రద్దు చేశారు. చిన్నగొట్టిగల్లు సీడీపీవో కేంద్రం పరిధిలోని చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాలెం మండలాలను తిరుపతి జిల్లాకు, కేవీపల్లె, పీలేరు మండలాలను అన్నమయ్య జిల్లాకు బదలాయించగా మిగిలిన కేంద్రాల్లోని మండలాలను తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వేర్వేరు సీడీపీవో కేంద్రాలకు సర్దుబాటు చేశారు. ప్రస్తుతం జిల్లాలో 11 సీడీపీవో కేంద్రాల పరిధిలో మొత్తం 2420 అంగన్‌వాడీ కేంద్రాలను (ఇందులో 625 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి) పునర్వవస్థీకరించారు. పునర్వ్యవస్థీకరణ అనంతరం నగరి సీడీపీవో కేంద్రం పరిధిలోకి విజయపురం, నిండ్ర, నగరి, కార్వేటినగరం, పాలసముద్రం మండలాలను (303 అంగన్‌వాడీ కేంద్రాలు), చిత్తూరు కేంద్రం పరిధిలోకి చిత్తూరు, గుడిపాల (227 కేంద్రాలు), పులిచెర్ల పరిధిలోకి రొంపిచెర్ల, పులిచెర్ల, పూతలపట్టు (270), గంగాధరనెల్లూరు పరిధిలోకి జీడీ నెల్లూరు, పెనుమూరు, వెదురుకుప్పం, ఎస్‌ఆర్‌ పురం (288), తవణంపల్లె పరిధిలోకి యాదమరి, తవణంపల్లె, ఐరాల (222). బైరెడ్డిపల్లె పరిధిలోకి బైరెడ్డిపల్లె, వి.కోట (184), పలమనేరు పరిధిలోకి బంగారుపాళ్యం, గంగవరం, పలమనేరు (249), పుంగనూరు పరిధిలోకి పుంగనూరు, పెద్దపంజాణి (191), చౌడేపల్లె పరిధిలోకి సోమల, చౌడేపల్లె, సదుం (170), కుప్పం పరిధిలోకి కుప్పం, గుడుపల్లె (237), శాంతిపురం పరిధిలోకి శాంతిపురం, రామకుప్పం మండలాలను (191 కేంద్రాలు) చేర్చారు.

ఫ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి పిచ్చాటూరు సీడీపీవో పరిధిలోని విజయపురం, నిండ్ర మండలాలు చిత్తూరు జిల్లాకే పరిమితం కాగా పిచ్చాటూరు మండలం మాత్రం తిరుపతి జిల్లాకు చేరింది.

ఫ పులిచెర్ల సీడీపీవో పరిధిలోని పాకాలను తిరుపతి జిల్లాకు చేర్చగా పులిచెర్ల మాత్రం చిత్తూరుకు పరిమితమైంది. ఇక పుంగనూరు సీడీపీవో పరిధిలోని రామసముద్రం అన్నమయ్య జిల్లాకు బదిలీ కాగా పెద్దపంజాణి, పుంగనూరు మండలాలు యథాతథంగా చిత్తూరు పరిధిలోకి చేరాయి.

Updated Date - 2022-11-21T01:07:55+05:30 IST

Read more