78 సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు

ABN , First Publish Date - 2022-11-25T00:01:37+05:30 IST

చిత్తూరు జిల్లాలోని గుర్తించిన సచివాలయాల్లో 78 జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయాలు ఏర్పాటు, వాటిలో రిజిస్ట్రేషన్లు నిర్వర్తించేందుకు 78 మంది కార్యదర్శులకు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రారు హోదా కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం విడివిడిగా రెండు ఉత్తర్వులు జారీ చేసింది.

78 సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు

జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్లుగా గ్రామ, వార్డు కార్యదర్శులు

ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

కలికిరి/చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 24: చిత్తూరు జిల్లాలోని గుర్తించిన సచివాలయాల్లో 78 జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయాలు ఏర్పాటు, వాటిలో రిజిస్ట్రేషన్లు నిర్వర్తించేందుకు 78 మంది కార్యదర్శులకు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రారు హోదా కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం విడివిడిగా రెండు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న భూముల రీ సర్వే పనులు పూర్తయిన 9 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో 78 సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేపట్టనున్నారు. ఆయా గ్రామ/వార్డు సచివాలయ కార్యదర్శులకు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రారుగా హోదా కల్పిస్తూ స్థానికంగానే రిజిస్ట్రేషన్లు చేపట్టడానికి ప్రభుత్వం అనుమతించింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని అందుకనువుగా పంచాయతీ రాజ్‌ కమిషనరు, గ్రామ, వార్డు వలంటీర్లు, కార్యదర్శుల శాఖ డైరెక్టరు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, జిల్లా కలెక్టర్లు వెంటనే తగు చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించారు. జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ హోదా పొందిన గ్రామ, వార్డు కార్యదర్శులకు రిజిస్ట్రేషన్లు చేసేందుకు డిజిటల్‌ అసిస్టెంట్లు సహకరించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. అన్నిరకాల ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిర్వహించేందుకు జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్లను ఆదేశించారు. కాగా, ప్రభుత్వం గుర్తించిన సచివాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించామని జిల్లా రిజిస్ట్రార్‌ శ్రీనివాసరావు తెలిపారు. సమగ్ర భూసర్వే పూర్తయిన ప్రాంతాలవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. సచివాలయాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో వెబ్‌ కెమెరా, రిజిస్ట్రేషన్‌ రికార్డులను తమ శాఖ అందించగా, స్కానర్‌, బయోమెట్రిక్‌ డివైజ్‌, బోర్డులను రెవెన్యూ శాఖ ఏర్పాటు చేస్తుందన్నారు.

రిజిస్ట్రేషన్లు జరిగే సచివాలయాలివీ

జిల్లాలోని 9 సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయాల పరిధిలో (మండల పరిధి కాదు) రిజిస్ట్రేషన్లు జరపడానికి అనుమతి లభించిన సచివాలయాల వివరాలిలా వున్నాయి.

చిత్తూరు రిజిస్ట్రారు కార్యాలయం (2 సచివాలయాలు): చింతలగుంట, పాపసముద్రం ఉన్నాయి.

చిత్తూరు రూరల్‌ ఎస్‌ఆర్వో(3): తవణంపల్లె, చిగరపల్లె, ఎర్రేపల్లె.

కుప్పం ఎస్‌ఆర్వో (36): బెగ్గిలిపల్లె, శెట్టిపల్లె, సోదిగానిపల్లె, గుండ్లసాగరం, సోదిగానిపల్లె, జరుగు, కృష్ణదాసనపల్లె, ఉర్లఓబనపల్లె, దాసేగౌనూరు, వెండుగంపల్లె, నడిమూరు, పెద్దబంగారునత్తం, కొత్తపల్లె, నూలుకుంట, మంకలొడ్డి, కొంగనపల్లె, చెల్దిగానిపల్లె, మనీంద్రం, విజలాపురం, అనిగనూరు, కెంచనబల్ల, అనికెర, 121పెద్దూరు, 64పెద్దూరు, దండికుప్పం, కొలమడుగు, మొరసనపల్లె, కర్లగట్ల, కడపల్లె, శివరామపురం, చిన్నారిదొడ్డి, శివునికుప్పం, కొంగాటం-1, ఓగు, పెద్దబడనవాడ.

పలమనేరు ఎస్‌ఆర్వో(24): బైరెడ్డిపల్లె, పాతూరునత్తం, కడపనత్తం, ధర్మపురి, చప్పిడిపల్లె, నెల్లిపట్ల, పత్తికొండ, మామడుగు, జీడిమాకులపల్లె, గంగవరం-3, కుర్మాయి, మొరం, కల్లడం, పెద్దవెలగటూరు, అప్పినపల్లె, శంకరాయలపేట, చామనేరు, నెర్రిపల్లె, వోగు, బైరుపల్లె, అంబేడ్కర్‌ నగర్‌, పెద్దభరిణిపల్లె, చింతమాకులపల్లె, కీలపల్లె.

బంగారుపాళ్యం ఎస్‌ఆర్వో(1): సంక్రాంతిపల్లె.

పుంగనూరు ఎస్‌ఆర్వో(1): తిమ్మానాయునిపల్లె

అన్నమయ్య జిల్లా.. కలికిరి ఎస్‌ఆర్వో(3): ఊటుపల్లె, పాలమంద, కంబంవారిపల్లె.

పీలేరు ఎస్‌ఆర్వో(5): యర్రాతివారిపల్లె, సదుం-2, నడిగడ్డ, బూరగమంద, చెరుకువారిపల్లె.

తిరుపతి జిల్లా.. పాకాల ఎస్‌ఆర్వో(3): చరవగానిపల్లె, చిటిపిరాళ్ళ, వేపనపల్లె.

Updated Date - 2022-11-25T00:01:37+05:30 IST

Read more