ఎర్రచందనం దుంగల పట్టివేత

ABN , First Publish Date - 2022-04-24T05:47:04+05:30 IST

ఎర్రచందనం దుంగలను తమిళనాడుకు తరలిస్తుండగా పాలసముద్రం పోలీసులు శనివారం వేకువ జామున రంగాపురం క్రాస్‌ వద్ద అరెస్టు చేశారు.

ఎర్రచందనం దుంగల పట్టివేత
ఎర్రచందనం తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చూపుతున్న పోలీసులు

తమిళనాడు వాసి అరెస్టు

పాలసముద్రం, ఏప్రిల్‌ 23: ఎర్రచందనం దుంగలను తమిళనాడుకు తరలిస్తుండగా పాలసముద్రం పోలీసులు శనివారం వేకువ జామున రంగాపురం క్రాస్‌ వద్ద అరెస్టు చేశారు. పోలీసులు వేకువ జామున వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక స్కార్పియోలో 14 ఎర్రచందన దుంగలను గుర్తించి పట్టుకున్నారు. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా అర్జునాపురం గ్రామానికి చెందిన నందకృష్ణ (29) వాహనంలో 14 ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా రంగాపురం క్రాస్‌ వద్ద పట్టుకుని అరెస్టుచేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు. వీటి విలువ రూ.9.30 లక్షలు ఉంటుందని ఎస్‌ఐ తెలిపారు. 

Read more