రేషన్‌ పంపిణీ గడువు రేపటి వరకు పొడిగింపు

ABN , First Publish Date - 2022-09-19T06:08:07+05:30 IST

ఈ నెల ఒకటో తేదీ నుంచి మొదలైన రేషన్‌ సరుకుల పంపిణీ గడువును కార్డుదారుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం మంగళవారం వరకు పొడిగించిందని డీఎస్వో ఇ.శంకరన్‌ తెలిపారు.

రేషన్‌ పంపిణీ గడువు రేపటి వరకు పొడిగింపు

చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 18: ఈ నెల ఒకటో తేదీ నుంచి మొదలైన రేషన్‌ సరుకుల పంపిణీ గడువును కార్డుదారుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం మంగళవారం వరకు పొడిగించిందని డీఎస్వో ఇ.శంకరన్‌ తెలిపారు. రేషన్‌ పొందని కార్డుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకో వాలని కోరారు. నగదు రేషన్‌ పంపిణీ ఆదివారం నాటికి 92.42 శాతంతో చిత్తూరు జిల్లా తొమ్మిదో స్థానంలో నిలిచిందని చెప్పారు. 5,31,264 కార్డుదారుల్లో 4,91,024 మంది, పోర్టబిలిటీ ద్వారా 1,01,045 మంది రేషన్‌ పొందినట్లు పేర్కొన్నారు. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన కింద 4,99,312 మంది కార్డుదారుల్లో ఇప్పటివరకు 4,54,023 మంది ఉచిత బియ్యం పొంది జిల్లా ఆరవ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.


Read more