రాజరాజేశ్వరిదేవి అలంకారంలో మరగదాంబిక

ABN , First Publish Date - 2022-09-29T06:01:34+05:30 IST

కాణిపాక వినాయక స్వామి ఆలయానికి అనుబంధ.. మణికంఠేశ్వరస్వామి ఆలయంలో రాజరాజేశ్వరిదేవి అలంకారంలో మరగదాంబిక బుధవారం భక్తులకు దర్శనమిచ్చారు.

రాజరాజేశ్వరిదేవి అలంకారంలో మరగదాంబిక

కాణిపాక వినాయక స్వామి ఆలయానికి అనుబంధ.. మణికంఠేశ్వరస్వామి ఆలయంలో రాజరాజేశ్వరిదేవి అలంకారంలో మరగదాంబిక బుధవారం భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కుంకుమార్చన నిర్వహించారు. రాత్రి మరగదాంబిక ఉత్సవమూర్తిని కాణిపాకం పురవీధులలో ఊరేగించారు. ఆలయ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ కోదండపాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్లు బాబు, రమేష్‌, అర్చకుడు ధర్మేశ్వరగురుకుల్‌ తదితరులు పాల్గొన్నారు. 

- ఐరాల(కాణిపాకం)


Read more