-
-
Home » Andhra Pradesh » Chittoor » Rain in 24 mandals-NGTS-AndhraPradesh
-
24 మండలాల్లో వర్షం
ABN , First Publish Date - 2022-07-18T06:46:24+05:30 IST
జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం 8 నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 24 మండలాల్లో తేలికపాటి నుంచి బలమైన వర్షం కురిసింది.

చిత్తూరు కలెక్టరేట్, జూలై 17: జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం 8 నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 24 మండలాల్లో తేలికపాటి నుంచి బలమైన వర్షం కురిసింది. అత్యధికంగా పెద్ద పంజాణిలో 34.2మి.మీ, అత్యల్పంగా పులిచెర్లలో 1.4 మి.మీ వర్షపాతం నమోదైంది.చిత్తూరు 26.6, విజయపురం 24.2, కుప్పం 16,4, పుంగనూరు 16.2, నిండ్ర 15.2, ఎస్ఆర్పురం 14, తవణంపల్లె 13.6, వీకోట 12, పలమనేరు 10.6, గంగవరం 10.4, గుడుపల్లెలో 10.2 మి.మీ వర్షం కురవగా మిగిలిన 11 మండలాల్లో అంతకంటే తక్కువ నమోదైంది.