పీఎ్‌సఎల్‌వీ-సీ 54 ప్రయోగానికి నేటినుంచి కౌంట్‌డౌన్‌

ABN , First Publish Date - 2022-11-25T00:11:46+05:30 IST

శ్రీహరికోటలోని షార్‌ నుంచి శనివారం ఉదయం 11.56గంటలకు పీఎ్‌సఎల్‌వీ- సీ 54 రాకెట్‌ ప్రయోగానికి నేడు కౌంట్‌డౌన్‌ ప్రారంభం కానుంది.గురువారం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌ హాల్లో డాక్టర్‌ బీఎన్‌.సురేష్‌ అధ్యక్షతన మిషన్‌ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్‌ఆర్‌) జరిగింది.ప్రయోగ సమయం, కౌంట్‌డౌన్‌పై శాస్త్రవేత్తలు సుదీరఽ్ఘంగా చర్చించారు.

పీఎ్‌సఎల్‌వీ-సీ 54 ప్రయోగానికి నేటినుంచి కౌంట్‌డౌన్‌
రాకెట్‌ చివరి భాగంలో అమర్చిన ఉపగ్రహాలు

సూళ్లూరుపేట, నవంబరు 24:శ్రీహరికోటలోని షార్‌ నుంచి శనివారం ఉదయం 11.56గంటలకు పీఎ్‌సఎల్‌వీ- సీ 54 రాకెట్‌ ప్రయోగానికి నేడు కౌంట్‌డౌన్‌ ప్రారంభం కానుంది.గురువారం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌ హాల్లో డాక్టర్‌ బీఎన్‌.సురేష్‌ అధ్యక్షతన మిషన్‌ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్‌ఆర్‌) జరిగింది.ప్రయోగ సమయం, కౌంట్‌డౌన్‌పై శాస్త్రవేత్తలు సుదీరఽ్ఘంగా చర్చించారు. అనంతరం షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌ అధ్యక్షతన లాంచింగ్‌ ఆథరైజేషన్‌ బోర్డు (లాబ్‌) సమావేశమై ప్రయోగానికి సంసిద్ధత తెలిపింది.శుక్రవారం ఉదయం 10.56గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించనున్నారు. 1117కిలోల ఓషన్‌ శాట్‌-3- (ఈవోఎస్‌-06),ఇండియా భూటాన్‌ దేశాలు సం యుక్తంగా రూపొందించిన 18.28 కిలోల అకా ఐఎన్‌ఎ్‌స-2బీ, భారత్‌కు చెందిన ధ్రువ స్పేస్‌ ఇండియా ప్రైవేట్‌ కంపెనీకి చెందిన 1.45 కిలోల బరువు గల రెండు తైబోల్ట్‌ ఉప్రగ్రహాలు, పిక్సిల్‌ ఇండియా కంపెనీకి చెందిన 16.51 కిలోల ఆనంద్‌, అమెరికాకు చెందిన 17.92 కిలోల బరువు గల ఆస్ర్టోకాస్ట్‌-2 పేరుతో నాలుగు ఉపగ్రహాలను ఈ రాకెట్‌ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.రాకెట్‌ నింగికెగసిన అనంతరం నాలుగు దశలను పూర్తిచేసుకొని చివరి దశలో ఉపగ్రహాలను కక్ష్యలోకి విడిచిపెడుతుంది.నాలుగో దశలో ఉన్న ఉపగ్రహా ల్లో మొదట ఓషన్‌శాట్‌-3 ఉపగ్రహాన్ని 17.20నిమిషాలకు భూమికి 720కిలో మీటర్ల ఎత్తులోని సూర్యనువర్తమాన ధ్రువ కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఈ ఉపగ్రహాన్ని విడిచిన అనంతరం ఇంజన్‌ రెండుసార్లు ఆపి మళ్లీ స్టార్ట్‌ చేసి పైకి కిందకు తిప్పుతూ మిగిలిన ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టేలా శాస్త్రవేత్తలు రాకెట్‌ను డిజైన్‌ చేశారు.కౌంట్‌డౌన్‌ జరిగే సమయంలో రాకెట్‌లోని అన్ని దశల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించి ఇంధనాన్ని నింపి లోటుపాట్లు ఉంటే సరిచేసి ప్రయోగానికి సిద్ధం చేశారు.

Updated Date - 2022-11-25T00:11:46+05:30 IST

Read more