సమస్యల పరిష్కార మే ధ్యేయం: జడ్పీ చైర్మన్‌

ABN , First Publish Date - 2022-05-18T06:23:14+05:30 IST

ప్రజా సమస్యల్ని గుర్తించి వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్‌ తెలిపారు.

సమస్యల పరిష్కార మే ధ్యేయం: జడ్పీ చైర్మన్‌
అంకిరెడ్లపల్లెలో గడపగడపకు కార్యక్రమంలో శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్‌

రామకుప్పం/ పుంగనూరు రూరల్‌, మే 17: ప్రజా సమస్యల్ని గుర్తించి వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్‌ తెలిపారు. మంళగవారం విజలా పురం పంచాయతీ అంకిరెడ్లపల్లెలో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. విజలాపురం పీహెచ్‌సీని 24 గంటల ఆస్పత్రిగా మార్చాలని,  సిబ్బందిని నియమించాలని  స ర్పంచు, వైసీపీ మండల కన్వీనర్‌ విజలాపురం బాబు వారికి వినతిపత్రం ఇచ్చారు.  జడ్పీటీసీ సభ్యుడు నితిన్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ సుబ్రహ్మణ్యం, ఎంపీటీసీ  సభ్యుడు వెంకట్రామగౌడు తదిత రులు పాల్గొన్నారు. పుంగనూరు పట్టణంలోని  హైస్కూల్‌వీధి, ఎంఎస్‌ఆర్‌ థియేటర్‌, తహసీల్దార్‌ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమంలో జానపద కళలసంస్థ రాష్ట్ర చైర్మన్‌ నాగభూషణం, చైర్మన్‌ అలీంబాషా, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. పేర్కొన్నారు.

Read more