-
-
Home » Andhra Pradesh » Chittoor » Priority for safety standards in industries Collector-NGTS-AndhraPradesh
-
పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలకు ప్రాధాన్యం: కలెక్టర్
ABN , First Publish Date - 2022-09-08T05:57:34+05:30 IST
జిల్లాలో ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో కార్మికుల భద్రతా ప్రమాణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కలెక్టర్ హరినారాయణన్ పేర్కొన్నారు.

చిత్తూరు కలెక్టరేట్, సెప్టెంబరు 7: జిల్లాలో ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో కార్మికుల భద్రతా ప్రమాణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కలెక్టర్ హరినారాయణన్ పేర్కొన్నారు. బుధవారం అమరావతి నుంచి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుడివాడ అమరనాథ్, జయరాములు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 857 పరిశ్రమలు ఏర్పాటుకాగా వీటిలో 37,365 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు చెప్పారు. జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేసి 90 రోజుల్లో ఫ్యాక్టరీలలో భద్రతా ప్రమాణాలు తనిఖీ చేస్తామన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల అధికారి చంద్రశేఖర్, కార్మిక శాఖ అధికారి ఓంకార్‌రావు, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివశంకర్, పొల్యూన్ కంట్రోల్ బోర్డు ఏఈఈ మదన్‌మోహన్ పాల్గొన్నారు.