బిల్లు కట్టలేదని రిజిస్ర్టేషన్‌ డీఐజీ ఆఫీస్‌కి పవర్‌ కట్‌

ABN , First Publish Date - 2022-02-20T05:19:03+05:30 IST

గిరింపేటలోని రిజిస్ర్టేషన్‌ కాంప్లెక్స్‌కు బిల్లులు చెల్లించలేదన్న కారణంగా ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపేశారు. ఈ కాంప్లెక్స్‌లో డీఐజీ, జిల్లా రిజిస్ర్టార్‌, సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు ఉన్నాయి.

బిల్లు కట్టలేదని రిజిస్ర్టేషన్‌ డీఐజీ ఆఫీస్‌కి పవర్‌ కట్‌

చిత్తూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 19: గిరింపేటలోని రిజిస్ర్టేషన్‌ కాంప్లెక్స్‌కు బిల్లులు చెల్లించలేదన్న కారణంగా ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపేశారు. ఈ కాంప్లెక్స్‌లో డీఐజీ, జిల్లా రిజిస్ర్టార్‌, సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీటన్నిటికీ కలిపి రూ.1.10 లక్షల విద్యుత్‌ బిల్లు బకాయి ఉంది. వారం రోజుల క్రితం బకాయి చెల్లించలేదని సరఫరా నిలిపివేయగా పది రోజుల్లో చెల్లిస్తామని రిజిస్ర్టేషన్‌ అధికారులు రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. అయితే బకాయిలు చెల్లించకపోవడంతో శనివారం పది గంటలకు విద్యుత్‌ సరఫరా నిలిపేశారు. దీంతో రిజిస్ర్టేషన్‌ పనులు స్తంభించాయి. మరో వారం రోజుల్లోగా బకాయి చెల్లిస్తామని అధికారులు మరో లేఖ ఇవ్వడంతో మధ్యాహ్నం 12 గంటలకు సరఫరా పునరుద్దరించారు. 

Read more