మొక్కలు మంచి అనుభూతినిస్తాయి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-09-11T05:50:49+05:30 IST

మొక్కలను పెంచడం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తాయని కలెక్టర్‌ హరినారాయణన్‌ అన్నారు.

మొక్కలు మంచి అనుభూతినిస్తాయి : కలెక్టర్‌
మొక్కను నాటుతున్న కలెక్టర్‌, జేసీ దంపతులు

చిత్తూరు, సెప్టెంబరు 10: మొక్కలను పెంచడం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తాయని కలెక్టర్‌ హరినారాయణన్‌ అన్నారు. నగరంలోని గాయత్రి నగర్‌లో ఏర్పాటు చేసిన పార్కులో శనివారం కలెక్టర్‌, జేసీ వెంకటేశ్వర్‌ దంపతులు మొక్కలు నాటారు. మొక్కలను నాటడంతో పాటు వాటిని పరిక్షించాల్సిన బాధ్యత కూడా ఉందన్నారు. పార్కును అభివృద్ధి చేస్తే కాలనీ ప్రజలకు ఆటవిడుపుగా ఉంటుందన్నారు. వీరి వెంట నగరపాలక సంస్థ కమిషనర్‌ అరుణ, ఇతర అధికారులు ఉన్నారు.


Read more