పద్మావతీ అమ్మవారికి పవిత్రాల సమర్పణ

ABN , First Publish Date - 2022-09-10T06:11:29+05:30 IST

పద్మావతీ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో రెండో రోజు శుక్రవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది.

పద్మావతీ అమ్మవారికి పవిత్రాల సమర్పణ
ఆలయ ప్రాకారం, ధ్వజస్తంభానికి పవిత్ర మాలలు సమర్పిస్తున్న అర్చకులు

తిరుచానూరు, సెప్టెంబరు 9: పద్మావతీ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో రెండో రోజు శుక్రవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. వేకువజామున అమ్మవారిని మేల్కొలిపి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం అమ్మవారి మూలమూర్తికి, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, పరివార దేవతలకు, విమానప్రాకారానికి, ధ్వజస్తంభానికి అర్చకులు శాస్త్రోక్తంగా పవిత్రాలు సమర్పించారు. సాయంత్రం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. శనివారం జరిగే పవిత్ర విసర్జన, మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈవో లోకనాధం, ఏఈవో ప్రభాకర్‌రెడ్డి, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, అర్చకులు బాబుస్వామి, వేంపల్లి శ్రీనివాస్‌, సూపరింటెండెంట్‌ మధు, శేషగిరి, ఇతర అధికారులు దామోదరం, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more