ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ల జోరు

ABN , First Publish Date - 2022-01-28T06:38:02+05:30 IST

శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వాస్పత్రికి వెళ్లే మార్గం ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు అడ్డాగా మారింది.

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ల జోరు
ప్రభుత్వ ఆస్పత్రి మార్గంలో గుమిగూడిన యువకులు

శ్రీకాళహస్తి, జనవరి 27: పట్టణంలోని ప్రభుత్వాస్పత్రికి వెళ్లే మార్గం ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు అడ్డాగా మారింది. ఈ మార్గంలో ఆస్పత్రితోపాటు రెండు జూనియర్‌ కళాశాలలు, ప్రైవేటు పాఠశాల, చెంచులక్ష్మీకాలనీ, పలు ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. దీంతో నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. ఇవన్నీ పట్టించుకోకుండా బెట్టింగురాయుళ్లు రోడ్డుకు అడ్డంగా నిలబడి తమ పనుల్లో బిజీగా ఉండడం సమస్యగా మారింది. వీరందరూ గుంపులుగా చేరడంతో ఎక్కడ కొవిడ్‌ వ్యాప్తి చెందుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి బెట్టింగులకు చెక్‌పెట్టడంపై దృష్టిసారించాలని కోరుతున్నారు. 

Read more