తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

ABN , First Publish Date - 2022-08-16T07:28:11+05:30 IST

తిరుమలలో సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. వరుస సెలవులతో పాటు పెళ్లిళ్ల ముహూర్తాలు ఉన్న క్రమంలో శనివారం సాయంత్రం నుంచి భక్తుల రద్దీ పెరిగిన విషయం తెలిసిందే.

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
ఆలయం ముందు భక్తుల రద్దీ

సర్వదర్శనానికి 30 గంటలు


తిరుమల, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. వరుస సెలవులతో పాటు పెళ్లిళ్ల ముహూర్తాలు ఉన్న క్రమంలో శనివారం సాయంత్రం నుంచి భక్తుల రద్దీ పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తిరుమల క్షేత్రం మొత్తం భక్తులతో నిండుగా కనిపిస్తోంది. అన్ని ప్రదేశాల్లో యాత్రికులు కిటకిటలాడుతున్నారు. కాగా, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు సర్వదర్శనం భక్తులతో నిండిపోయి క్యూలైన్‌ లేపాక్షి మీదుగా ఆస్థానమండపం వరకు వ్యాపించింది. సర్వదరనానికి 30 గంటల దర్శన సమయం పడుతున్నట్టు టీటీడీ ప్రకటించింది. మరోవైపు  గదుల కోసం గంటల తరబడి భక్తులు నిరీక్షిస్తున్నారు. గదులు లభించని భక్తులు షెడ్లు, కార్యాలయాలు, రోడ్డుపక్కన ఫుట్‌పాత్‌లు, చెట్ల కింద సేదదీరుతున్నారు.వీరంతా సోమవారం రాత్రి 7 గంటల సమయంలో వర్షం కురిసిన నేపథ్యంలో భక్తులు ఇబ్బంది పడ్డారు. 

Updated Date - 2022-08-16T07:28:11+05:30 IST