కొనసాగుతున్న అన్నదానం

ABN , First Publish Date - 2022-07-07T06:10:26+05:30 IST

కుప్పం పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్న క్యాంటీన్‌ ద్వారా అన్నదానం కొనసాగుతోంది. బుధవారం మాజీ ఎమ్మెల్యే రంగస్వామినాయుడు 5వ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి హేమావతి ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది.

కొనసాగుతున్న అన్నదానం
కుప్పంలో అన్నదానం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రంగస్వామినాయుడు కుటుంబ సభ్యులు తదితరులు

కుప్పం, జూలై 6: పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్న క్యాంటీన్‌ ద్వారా అన్నదానం  కొనసాగుతోంది. బుధవారం మాజీ ఎమ్మెల్యే రంగస్వామినాయుడు 5వ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి హేమావతి ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట తొలుత రంగస్వామినాయుడికి నివాళి అర్పించారు.  కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని వక్తలు కొనియాడారు. అనంతరం మధ్యాహ్నం సుమారు 500మందికి అన్నదానం చేశారు. రంగస్వామినాయుడు కుటుంబ సభ్యులతోపాటు చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పి.మనోహర్‌, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.

Read more