వరసిద్ధుడికి పట్టు వస్త్రాల సమర్పణ

ABN , First Publish Date - 2022-09-18T04:52:37+05:30 IST

కాణిపాకంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాలను పురస్కరించుకొని శనివారం మహిళా,శిశు సంక్షేమ శాఖ రాయలసీమ జోనల్‌ చైర్‌పర్సన్‌ శైలజాచరణ్‌రెడ్డి స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

వరసిద్ధుడికి పట్టు వస్త్రాల సమర్పణ
పట్టువస్త్రాలు సమర్పిస్తున్న శైలజాచరణ్‌రెడ్డి

ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు17: కాణిపాకంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాలను పురస్కరించుకొని శనివారం మహిళా,శిశు సంక్షేమ శాఖ రాయలసీమ జోనల్‌ చైర్‌పర్సన్‌ శైలజాచరణ్‌రెడ్డి స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ ఈవో సురే్‌షబాబు వారిని ఆహ్వానించి స్వామ దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం వేదాశీర్వాద మండపంలో వారిని వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామి శేషవస్త్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సుచిత్ర, ఎంపీటీసీ లోకే్‌షరెడ్డి, ఆలయ అధికారులు, వైసీపీ నాయకులు సురే్‌షరెడ్డి, చిన్నారెడ్డి, భాస్కరయ్య తదితరులు పాల్గొన్నారు.

Read more