ఎన్టీఆర్‌ పేరుమార్పు చారిత్రాత్మక తప్పిదం

ABN , First Publish Date - 2022-10-05T04:42:53+05:30 IST

ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సీటీ పేరు మార్పు చారిత్రాత్మక తప్పిదమని టీడీపీ మండల అధ్యక్షుడు రంగనాథ్‌ అన్నారు. మంగళవారం వి.కోటలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ రామచంద్రనాయుడు నేతృత్వంలో నిరాహార దీక్ష చేపట్టారు. మూడేళ్ల వైసీపీ పాలనలో అక్రమాలు, అరాచకాలు తప్ప జరిగిన అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌనివారి శ్రీని వాసులు, కుప్పం నియోజకవర్గ ఇన్‌చార్జి మునిరత్నం అన్నారు.

ఎన్టీఆర్‌ పేరుమార్పు చారిత్రాత్మక తప్పిదం
వి.కోట దీక్షా శిబిరంలో టీడీపీ నేతలు

 వి.కోట, అక్టోబరు 4: ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సీటీ పేరు మార్పు చారిత్రాత్మక తప్పిదమని టీడీపీ మండల అధ్యక్షుడు రంగనాథ్‌ అన్నారు. మంగళవారం వి.కోటలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ రామచంద్రనాయుడు నేతృత్వంలో నిరాహార దీక్ష చేపట్టారు. వైసీపీ ప్రభు త్వం తమ వైఫల్యాలను దృష్టి మరల్చేందుకు పేరు మార్పునకు పూనుకుందని పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చౌడప్ప అన్నారు.  ఎన్టీఆర్‌ పేరు మార్చి వైఎస్‌ పేరు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా మ న్నారు. వైసీపీ ప్రభుత్వం కొత్తగా ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించి దానికి ఆయ న పేరు పెట్టిఉంటే బాగుండే దన్నారు. సీఎంగా జగన్‌ గద్దెనెక్కిన నాటినుంచి కక్ష సాధింపులు, అక్రమ కేసులతో  ఇ బ్బందులకు గురి చేయడం తప్ప చేసిందే మి లేదన్నారు.  పార్టీ జిల్లా అధికార ప్రతి నిధి రాంబాబు, మండల కార్యదర్శి ఈశ్వర్‌, తెలుగు యువత మండల అధ్యక్షుడు ధీరజ్‌, నాయకులు సోము, విశ్వనాథ్‌, ప్రవీణ్‌కుమార్‌, నాగభూషణం, శబ రీష్‌, భక్తా, నారాయణరాజు, ముని రత్నం, నారాయణ, రామూర్తిఆచ్చారి, ఐటీడీపీ ఫోరం హరి, కోదండ, రవి, ఉదయ్‌, మురుగేష్‌, లక్ష్మణ్‌, సురేంద్ర, నారాయణ స్వామి, రాము తదితరులు పాల్గొన్నారు.


శాంతిపురం: మూడేళ్ల వైసీపీ పాలనలో అక్రమాలు, అరాచకాలు తప్ప జరిగిన అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌనివారి శ్రీని వాసులు, కుప్పం నియోజకవర్గ ఇన్‌చార్జి మునిరత్నం అన్నారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సీటీ పేరు మార్పును నిర సిస్తూ టీడీపీ శ్రేణులు మంగళవారం శాంతిపురంలో నిరాహర దీక్ష చేపట్టాయి. గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సంస్థలకు పేర్లు మార్చడం తప్ప వైసీపీ ప్రభుత్వం చేసిందేమి లేదన్నారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో తారురోడ్లు, రక్షిత మంచినీ ట్యాంకులు, పాఠశాలలు, జూనియర్‌, ఇంజినీరింగ్‌, మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు చేశారన్నారు. రూ.480కోట్లతో హంద్రీ-నీవా కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులను 90శాతం పూర్తి చేశార న్నారు. కుప్పం మున్సిపాల్టీకి రూ.64కోట్లు విదిల్చి తా మేదో గొప్పపని చేస్తున్నామని చెప్పడం హాస్యా స్పదమన్నారు. దీక్షకు ముందు ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పించారు.  విశ్వనాథనాయుడు, నాగరాజు, ఉదయ్‌కుమార్‌, విజయరామిరెడ్డి, ఏఎంసీనాగరాజు, సింగిరిశ్రీనివాసులు, రమేష్‌, ఉయ్యాల జయరామిరెడ్డి, చంద్రకళ, సుగుణమ్మ, అనసూయ, నాలుగు మండలాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Read more