జగన్‌పై పెరుగుతున్న వ్యతిరేకత

ABN , First Publish Date - 2022-10-04T06:15:23+05:30 IST

జగన్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకుడు అమరనాథరెడ్డి అన్నారు.

జగన్‌పై పెరుగుతున్న వ్యతిరేకత
సమావేశంలో ప్రసంగిస్తున్న పులివర్తి నాని, పక్కన మంత్రి అమర్‌

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీకాంత్‌ను గెలిపించండి

అమరనాథరెడ్డి, పులివర్తి నాని


తిరుచానూరు, అక్టోబరు 3: జగన్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకుడు అమరనాథరెడ్డి అన్నారు. స్థానిక రఘునాథ్‌ రిసార్ట్స్‌లోని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం తూర్పు రాయలసీమ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలు, ఓటరు నమోదుపై  క్లస్టర్‌, యూనిటీ ఇన్‌చార్జీలతో పులివర్తినాని ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ముఖ్యంగా టీచర్లు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి తప్పదన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తుందన్నారు. సార్వత్రిక ఎన్నికలకంటే ముందుగానే గ్రాడ్యుయేట్‌, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానీని ఎన్నికలకు ముందుగానే పార్టీ అధిష్ఠానం ప్రకటించడం శుభపరిణామమన్నారు. ప్రతి కార్యకర్త, నాయకుడు వచ్చే ఎన్నికల్లో ఆయన విజయానికి కృషి చేయాలని సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ను నాని పరిచయం చేశారు. నాయకులు ఈశ్వర్‌రెడ్డి, అమిలినేని మధు, కత్తిసుధాకర్‌, మధుశేఖర్‌, రఘు, తిరుమలరెడ్డి, నాగరాజునాయుడు, మురళి, కిషోర్‌రెడ్డి, మునికృష్ణారెడ్డి, సాల్మన్‌రాజు, సురేంద్రనాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Read more