తిరుమలేశుడి సేవలో ఎమ్మెల్సీ కవిత

ABN , First Publish Date - 2022-02-19T07:39:05+05:30 IST

కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత శుక్రవారం ఉదయం తిరుమల వేంకటేశ్వరస్వామిని కుటుంబసభ్యులతో కలసి దర్శించుకున్నారు.

తిరుమలేశుడి సేవలో ఎమ్మెల్సీ కవిత
తిరుమల ఆలయం ముందు కవిత దంపతులు

తిరుచానూరు/తిరుపతి రూరల్‌/తిరుమల,ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత శుక్రవారం ఉదయం తిరుమల వేంకటేశ్వరస్వామిని కుటుంబసభ్యులతో కలసి దర్శించుకున్నారు.వేదపండితులు ఆశీర్వదించగా, అఽధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు. తర్వాత తిరుమలలోని శ్రీవారిపాదాలను, ఆకాశగంగ తీర్థాలను సందర్శించారు.తిరుమల లేపాక్షి సర్కిల్‌లోని బుక్‌స్టాల్‌లో ఆధ్యాత్మిక గ్రంథాలను కొనుగోలు చేశారు.అనంతరం తిరుపతికి చేరుకున్న కవిత తిరుచానూరు వెళ్లి పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి తదితరులు దర్శన ఏర్పాట్లు చేశారు.తుమ్మలగుంటలోని కల్యాణ వేంకటేశ్వర స్వామిని కూడా కవిత దర్శించుకున్నారు.ఎంపీపీ మోహిత్‌రెడ్డి పూర్ణకుంభ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.ప్రముఖ రచయిత నామిని సుబ్రహ్మణ్యం నాయుడు రచనల సమాహారం మిట్టూరోడి సాహిత్యం పుస్తకాన్ని కవితకు రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్‌ పురుషోత్తంరెడ్డి అందజేశారు.

Read more